ఆంధ్రప్రదేశ్‌

4 నుంచి సిఎం అమెరికా పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 28: రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు, మంత్రి లోకేశ్‌తో సహా 17 మంది బృందంతో సహా వచ్చే నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, న్యూజెర్సీ రాష్ట్రాల్లో 17 మంది సభ్యుల బృందం పర్యటించనుంది. యుఎస్‌ఐబిసి వార్షిక వెస్ట్‌కోస్ట్ సదస్సు, టైకాన్-2017 సదస్సులో బాబు పాల్గొంటారు. వ్యయాన్ని రాష్ట్ర ఆర్థిక మండలి నిధుల నుంచి భరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, లోకేశ్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సిఎం ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఇంధన, సిఆర్‌డిఎ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్, ఆర్థిక అభివృద్ధి మండలి సిఈఓ కృష్ణకిషోర్, సిఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జెఎ చౌదరి, సిఎం వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాసరావు, సిఎం వ్యక్తిగత సహాయకుడు బి.రాజగోపాల్, సిఎం భద్రతా అధికారులు నలుగురు ఈ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి బృందం పర్యటన ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.