ఆంధ్రప్రదేశ్‌

అప్పన్న చందనోత్సవంలో విఐపి టిక్కెట్ల రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 28: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం(చందనోత్సవం)లో విఐపి టిక్కెట్ల జారీ వివాదాలకు దారితీసింది. టిక్కెట్ల జారీలో ఎమ్మెల్యేలు దేవస్థానం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చందనోత్సవానికి విఐపి టిక్కెట్ల జారీకి దేవస్థానం నిర్ణయించింది. విఐపిల ప్రాధాన్యం తగ్గించి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇనున్నట్టు ప్రకటించిన అధికారులు అందుకు తగ్గట్టు 5,100 విఐపి టిక్కెట్ల జారీ చేయాలని నిర్ణయించారు. రూ.1000 విలువ గల విఐపి టిక్కెట్ల కోసం ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా పలు ప్రభుత్వ శాఖల నుంచి వందల కొద్దీ దరఖాస్తులు అందాయి. జారీ చేయదలచిన టిక్కెట్ల సంఖ్యకు నాలుగు రెట్లు కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. నగర ఎమ్మెల్యేలు, ఎంపీలే కాకుండా 13 జిల్లాల ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా దరఖాస్తులు అందాయి. వీటిని పరిశీలించిన అధికారులు టిక్కెట్ల జారీలో భారీగా కోత విధించారు. అయితే, ప్రజా ప్రతినిధులకు విఐపి టిక్కెట్ల జారీ విషయంలో దేవస్థానం అధికారులు సమతూకం పాటించకపోవడం వివాదాలకు దారితీసింది. విశాఖ జిల్లా విషయానికొస్తే నగర ఎమ్మెల్యేలకు విశేష ప్రాధాన్యం ఇచ్చిన దేవస్థానం యంత్రాంగం రూరల్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులకు టిక్కెట్ల జారీలో కోత విధించారు. నగరంలో ఒక్కో ఎమ్మెల్యేకి దాదాపు 100 విఐపి టిక్కెట్లు జారీ చేయగా, రూరల్ పరిధిలో ఎమ్మెల్యేలకు 20 నుంచి 40 మాత్రమే జారీ చేశారు. శుక్రవారం ఉదయం నుంచి దేవస్థానం పరిపాలనావిభాగం వద్ద నగర, గ్రామీణ ఎమ్మెల్యేల వ్యక్తిగత సహాయకులు, అనుచరుల కోలాహలం కనిపించింది. అయితే, టిక్కెట్ల జారీలో భారీ వ్యత్యాసాన్ని గుర్తించిన గ్రామీణ ఎమ్మెల్యేల అనుచరులు దేవస్థానం అధికారులతో వాగ్వాదానికి దిగారు. టిక్కెట్ల జారీలో చోటుచేసుకున్న వివక్షను ఎమ్మెల్యేలకు వివరించడంతో, వారు నేరుగా దేవస్థానం అధికారులను ఫోన్‌లో నిలదీశారు.