ఆంధ్రప్రదేశ్‌

ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్-2017

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 28: ఎపి ఎంసెట్-2017 అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షలు శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2.30నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. 80వేల 843 మంది అభ్యర్ధులు ఈ పరీక్షలకు హాజరు కావల్సి ఉండగా, 75వేల 381 మంది హాజరయ్యారు. 5462 మంది గైర్హాజరు కాగా 93.24 శాతం హాజరు లభించింది. అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్‌లోని 43 రీజనల్ సెంటర్లు, హైదరాబాద్‌లో 3 రీజనల్ సెంటర్ల పరిధిలో 139 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్ పరీక్షలను ఈనెల 24,25,26 తేదీలలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఎంసెట్ ప్రిలిమినరీ కీని శుక్రవారం సాయంత్రం మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్షలు ముగిసిన వెంటనే విడుదలచేశారు. విద్యార్థులు తమ ప్రశ్నాపత్రాలను నిర్ధారించిన కీతో పోల్చుకునేందుకు వీలుగా వారి దరఖాస్తు పత్రంలో పేర్కొన్న ఈ-మెయిల్‌కు జవాబుపత్రాలను విడుదలచేశారు. ఈ-మెయిల్స్‌కు జవాబుపత్రాలను పంపించడంతో పాటు వెబ్‌సైట్‌లో కూడా పొందుపరిచారు. ప్రిలిమినరీ కీపై ఏ విధమైన అభ్యంతరాలున్నా మే 1వ తేదీలోగా విశ్వ విద్యాలయానికి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఎంసెట్‌పై సందేహాల నివృత్తికి 0884-2356255, 0884-2340535 ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చని ఎంసెట్-2017 కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు చెప్పారు. ఎంసెట్ ఫలితాలను మే 5న విడుదల చేస్తామన్నారు. ఇంటర్మీడియెట్ కాకుండా సిబిఎస్‌ఇ, ఎపిఒఎస్‌ఎస్, టిఎస్‌ఒఎస్, డిప్లమో, ఆర్‌జియుకెటి, ఐఎస్‌సి, ఇంటర్మీడియెట్ ఒకేషనల్, ఇతర బోర్డుల నుండి ఎంసెట్‌కు హాజరైద విద్యార్థులు వైబ్‌సైట్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ అభ్యర్ధులకు విడివిడిగా పొందుపరచిన డిక్లరేషన్ ఫారంలను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా జెఎన్‌టియుకెలోని ఎంసెట్ కార్యాలయానికి ఈ-మెయిల్ ఐడి ద్వారా గాని, పోస్ట్ ద్వారాగాని పంపాలని స్పష్టం చేశారు. డిక్లరేషన్ ఫారం సహా అటెస్టేషన్‌తో కూడిన మార్కుల జాబితాలను పంపాలని, అపుడే వారి మార్కుల వెయిటేజీని తీసుకుని, ఎంసెట్ మార్కులతో కలిపి ర్యాంకులను వెల్లడిస్తామని కన్వీనర్ తెలిపారు.