ఆంధ్రప్రదేశ్‌

ఆపరేషన్ ఆకర్ష్‌కు బిజెపి వ్యూహం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 28: ఆపరేషన్ ఆకర్ష్.. కొంత కాలంగా రాష్ట్ర రాజకీయ పార్టీల్లో వాడుకలో ఉన్న పదం. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలను, నాయకులను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత అదే కాంగ్రెస్ వారిని, వైకాపా వారిని తన గూటిలోకి చేర్చుకున్నారు. ఇప్పుడు బిజెపి ఈ ఆపరేషన్‌ను ప్రారంభించనుందా? దీనికి ఔననే సమాధానం వస్తోంది. ఏపిలో అంతంతమాత్రంగా ఉన్న భారతీయ జనతా పార్టీ 2019 నాటికి బలమైన శక్తిగా ఎదగబోతోంది. ఉత్తరాది నుంచి జైత్ర యాత్రను ప్రారంభించిన బిజెపి, ఇప్పుడు దక్షిణాదిని కూడా చేజిక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. 2014 ఎన్నికల నాటికి రాష్ట్రంలో కేవలం రెండు లక్షల సభ్యత్వంతో ఉన్న బిజెపి, ఇప్పుడు ఆ బలాన్ని పాతిక లక్షలకు పెంచుకుంది. మరో రెండేళ్లలో 50 లక్షల సభ్యత్వాన్ని దాటిపోవాలని వ్యూహ రచన చేస్తోంది. 2014లో ఏపిలో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసింది. కానీ, 2019 నాటి ఎన్నికలకు వీలైతే ఒంటరిగానే పోటీ చేయాలన్న లక్ష్యంతో ముందుకు కదులుతోంది. ఎలక్షన్ మేనేజ్‌మెంట్ తెలిసిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పుడు ఏపిని టార్గెట్‌గా చేసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలలో ఆయన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మేలో అమిత్ షా పర్యటన, జూలైలో విశాఖలో జాతీయ మహాసభల నిర్వహణ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భువనేశ్వర్‌లో జరిగిన పార్టీ జాతీయ మహా సభల తరువాత ఏపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ శని, ఆదివారాల్లో విశాఖలో జరగబోతున్నాయి. ఈ సమావేశంలో కేవలం పార్టీ బలోపేతం గురించి మాత్రమే చర్చిస్తామని పార్టీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలో బలీయమైన శక్తిగా ఎదిగేంతగా రాష్ట్ర పార్టీ ఇంకా పుంజుకోలేదని పార్టీ నాయకుల్లో కొంతమంది భావిస్తున్నారు. కానీ, పార్టీ జాతీయ నాయకత్వం మాత్రం ఏపిలో పార్టీ తన కాళ్లపై తాను నిలబడేలా చేయడానికి చాపకింద నీరుగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. సమీప భవిష్యత్‌లోనే బిజెపి శక్తి సామర్థ్యాలను ప్రత్యర్థ పార్టీలకు చూపించాలన్న ఆలోచనలో ఉంది. కాంగ్రెస్, టిడిపిల్లో మాదిరి 2019 ఎన్నికలకు ముందే, ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలుపెట్టాలన్న ఆలోచనలో బిజెపి ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖలో ఇందుకు రంగం సిద్ధం అయినట్టు సమాచారం.