ఆంధ్రప్రదేశ్‌

బ్లాక్ జోన్స్ సమస్యకు త్వరలోనే పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 28: రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై ఉన్న 1130 బ్లాక్ జోన్స్‌ను గుర్తించి నెల రోజుల్లో సరిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో రహదారి భద్రతపై శుక్రవారం ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ బ్లాక్ జోన్స్ వద్ద అసలు సమస్య ఏమిటో గుర్తించి సత్వరమే సరి చేయాలన్నారు. పోలీస్, రవాణా శాఖలు సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించాలన్నారు. ఇందుకు ఆరు నెలల గడువు అవసరం అవుతుందని అధికారులు చెప్పినప్పటికీ, ప్రాధాన్యత క్రమంతో పరిష్కరించాలని సిఎం స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణలో అలసత్వం ప్రదర్శించడానికి వీల్లేదన్నారు. ఏ అధికారి అయినా సరిగా పనిచేయడం లేదని తేలితే వెంటనే తొలగించడానికి కూడా వెనుకాడవద్దన్నారు. పోలీసు, రవాణా శాఖ జవాబుదారీతనం పెరగాలన్నారు. అధిక వేగాన్ని నిరోధించేందుకు స్పీడ్ గన్స్ ఏర్పాటు చేయాలని, టోల్ గేట్ల దగ్గరే జరిమానా విధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, పోలీసు, రవాణా శాఖ అధికారులు వారానికి ఒక రోజు పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో రహదారి భద్రతపై అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ చర్చించాలని, దీనిపై ప్రత్యేకంగా పుస్తకం వెలువరించాలన్నారు. అవసరమైతే పాఠ్యాంశంగా చేర్చాలన్నారు. ప్రతినాలుగో మంగళవారం రహదారి భద్రతపై సమీక్షిస్తానని తెలిపారు. నెలవారీ సమీక్షలో అధికారుల అలసత్వం తేలితే కఠిన చర్యలు తప్పవన్నారు. 68 శాతం ప్రమాదాలు కూడళ్ల వద్ద జరుగుతున్నాయని చెప్పారు. అవసరమైతే కమ్యూనిటీ పోలీసింగ్ ఏర్పాటు చేయాలన్నారు. వారంలో ఒక రోజు తప్పనిసరిగా తనిఖీలు చేయాలన్నారు. హెల్మెట్ ధరించడం, సీటు బెల్టు పెట్టుకోవడం తప్పనిసరి చేయాలన్నారు. 32 శాతం ప్రమాదాలు ద్విచక్రవాహనాలకు సంబంధించినవేని, 17 శాతం కారు ప్రమాదాలని తెలిపారు.