ఆంధ్రప్రదేశ్‌

రైతులకు ప్లాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 24: రాజధానిలో భూ సమీకరణ కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో నిబంధనలు.. మార్గదర్శకాలను సీఆర్డీఏ ప్రకటించింది. కొద్దిరోజుల కిందట విజయవాడలో రైతుల ప్లాట్లపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందు లో రైతులు వెలిబుచ్చిన సందేహాలను నివృత్తిచేస్తూ నిబంధనలను రూపొందించారు. అమరావతి నిర్మాణంకోసం ప్రభుత్వం 20 వేలమంది రైతుల నుంచి 33,500 ఎకరాలను సేకరించింది. జరీబు భూముల రైతులకు వెయ్యి చదరపు గజాల నివేశన స్థలంతోపాటు 400 గజాలను వాణిజ్య సముదాయాల ప్రాంతాల్లో, మెట్ట్భూముల రైతులకు 800 చదరపు గజాల భూమిని నివాస, 200 గజాల స్థలాన్ని వాణిజ్య ప్రాంతాల్లో కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసైన్డ్ భూముల హక్కుదార్లకు కూడా ప్లాట్లు కేటాయిస్తామని ప్రకటించింది. ఇదిలా ఉండగా జరీబు, మెట్ట ప్రాంతాల్లో భూములిచ్చిన రైతులకు త్వరలో ప్లాట్లు పంపిణీ చేసేందుకు విధివిధానాలు రూపొందించారు. మొత్తం 5 కేటగిరీలుగా ప్లాట్లను వర్గీకరించి పంపిణీ చేస్తారు. లాటరీ పద్ధతి ద్వారా రైతులకు అదే గ్రామంలో కోరుకున్నచోట ప్లాటు కేటాయిస్తారు. 30 చదరపు గజాల పెంపుతో ప్రామాణిక సైజు ప్లాట్లు, ప్రత్యేకంగా ఉమ్మడి ప్రామాణిక ప్లాట్లలో అవిభక్త వాటా అమ్ముకునేందుకు వీలుగా అభివృద్ధి హక్కు బాండ్లు (టీడీఆర్)ను ప్రభుత్వం అందిస్తుంది. ప్లాటు సైజులో కేటాయింపుపోగా మిగిలిన భూమిని రైతులు నేరుగా అమ్ముకోవచ్చు. లేదా సీఆర్డీఏకు అప్పగించినా వేలం ద్వారా విక్రయించి ఆ సొమ్మును రైతుల ఖాతాలో జమచేస్తుంది. రాజధానిలో జోనింగ్‌కు అనుగుణంగా నివాస స్థలాలను ఆర్-3, వాణిజ్య సముదాయాల జోన్ సీ-2లో ప్లాట్ల కేటాయింపు జరపాలని సీఆర్డీయే నిర్ణయించింది. ప్లాట్ల కనీసపు విస్తీర్ణం 120 చదరపు గజాలుగా ఉంటుంది. నివాస లే అవుట్లలో 120 చదరపు గజాల నుండి 4800 చదరపు గజాల వరకు 30 చదరపు గజాల పెంపుదలతో అందజేస్తారు. ఈ విస్తీర్ణానికి పైబడి 60 చదరపు గజాల పెంపుదలతో ప్లాట్ల వివరాలను కోడ్ నెంబర్లను సీఆర్డీయే వెలువరించింది. వాణిజ్య ప్లాట్లలో కనీసపు స్థలం 30 చదరపు గజాలు ఉంటుంది. లేఅవుట్లలో 30 చదరపు గజాల నుండి 4,800 చదరపు గజాల వరకు పెంపుతోపాటు ఆపై కేటాయింపులను 60 చదరపు గజాల పెంచుతూ నిర్ణయించారు. ప్లాట్ల కేటాయింపు విధానాన్ని ప్రకటించిన 15 రోజుల్లోగా భూ యజమానులు అర్హత మేరకు రెవిన్యూ గ్రామాలలో భూ సమీకరణ అభివృద్ధి పథకం కింద 9.18 ఏ లేదా 9.18 బీ ఫారాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. భూ యజమానులు వారు ఎంపిక చేసుకున్న విధంగా అర్హత మేరకు వివిధ ప్రామాణిక సైజు కలిగిన ప్లాట్లను కోరే వీలుంటుంది. ప్లాట్లు పోగా మిగిలిన స్థలాన్ని ఇతరులతో కలసి ఉమ్మడి ప్లాటుగా కానీ సీఆర్డీయే గుర్తించిన ప్రామాణిక ప్లాట్లలో అవిభక్త వాటాలుగా కానీ అమ్ముకునేందుకు అనుమతినిస్తూ టీడీఆర్ బాండ్లను రైతులు పొందాల్సి ఉంటుంది. అవిభక్త వాటాలను యజమానుల లిఖితపూర్వక సమ్మతితో సీఆర్డీయే బహిరంగ వేలం నిర్వహించి వచ్చిన సొమ్మును రిజిస్ట్రేషన్ చార్జీలు పోగా దామాషా పద్ధతిన రైతులకు చెల్లించే విధానం కూడా ప్రవేశపెట్టింది. ఉదాహరణకు భూ సమీకరణ కింద 2.25 ఎకరాలు భూమి ఇచ్చిన రైతుకు నివాస స్థలం కింద 2250 చదరపు గజాలు కేటాయించాలి. అయితే సీఆర్డీయే వర్గీకరించిన ప్లాటు సైజు 2245గా ఉండవచ్చు. మిగిలిన 5 చదరపు గజాల స్థలాన్ని ఇతరులతో కలసి లేదా కుటుంబ సభ్యుల వాటాతో కలిపి ప్లాటుగా కోరవచ్చు లేదా విక్రయించుకోవచ్చు.. లేదా సీఆర్డీఏ ఇచ్చే టీడీఆర్ బాండు పొంది మార్కెట్ ధర ప్రకారం సొమ్ము పొందే వీలుంటుంది. రైతులు భూమి ఉన్న తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలసి రావాల్సిన స్థలాన్ని ఉమ్మడి ప్లాట్లుగా వివిధ విస్తీర్ణంలో కోరే అవకాశం ఉంది. ఒక రెవిన్యూ గ్రామ పరిధిలో ఉన్న భూమికి సంబంధించిన ప్లాట్ల కేటాయింపు అదే రెవిన్యూ గ్రామ పరిధిలో ఉంటుంది. భూ యజమానికి ఇతర రెవిన్యూ గ్రామాల్లో భూములు ఉంటే ఆయా గ్రామాల్లోనే ప్లాట్ల కేటాయింపు జరుపుతారు. ఎంపిక చేసుకున్న ప్లాట్ల కేటగిరీల వారీగా లాటరీ విధానం ద్వారా కేటాయింపులు జరుపుతారు. రెవిన్యూ గ్రామం ఓ యూనిట్‌గా ప్లాట్లు కేటాయిస్తారు. ప్రామాణిక సైజు ప్లాట్లలోని అవిభక్త వాటాల వర్గీకరణ వీలుపడదని సీఆర్డీయే తేల్చిచెప్పింది. గడువులోపు దరఖాస్తులు దాఖలు చేయకపోతే అవిభక్త వాటాలను కేటాయిస్తారు. ఏ కేటగిరీ కింద 100 నుంచి 200 చదరపు మీటర్లు, బీ కేటగిరీలో 200 నుంచి 400, సీ కేటగిరీలో 400 నుంచి 12వందలు, డీ కేటగిరీలో 12 వందల నుంచి 5వేలు, ఇ కేటగిరీలో 5వేల నుండి 22,850 చదరపు మీటర్లుగా నిర్ధారంచారు. స్థలాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ప్లాట్ల విస్తీర్ణం, మాస్టర్‌ప్లాన్‌లో రోడ్డుల డిజైన్లను బట్టి మార్పులు ఉంటాయని సీఆర్డీయే స్పష్టం చేసింది. ఆర్-3 రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ప్లాట్లు పొందిన వారు 100 చదరపు మీటర్ల పరిధిలో జీ ప్లస్-3 భవనాన్ని నిర్మించుకోవచ్చు. 300 చదరపు మీటర్ల స్థలంలో జీ ప్లస్-5, 2000 చదరపు మీటర్ల నుంచి నాలుగు వేలలోపు విస్తీర్ణం కలిగిన ప్లాట్లలో జీ ప్లస్-11 నిర్మాణాలకు అనుమతి ఉంటుంది. వాణిజ్య ప్రదేశాలకు సంబంధించి సీ-2 జోన్‌లో కేటాయించిన ప్లాట్లలో 50 చదరపు మీటర్లలో జీ ప్లస్-1, 100 నుండి 300 చదరపు మీటర్లలో జీ ప్లస్-3, 500 నుంచి 2000 చదరపు మీటర్లలో జీ ప్లస్ 5, మూడువేల చదరపు మీటర్ల పరిధితో పాటు ఆ పైబడిన స్థలాల్లో జీ ప్లస్-8 భవనాలు నిర్మించుకోవచ్చు. వివిధ గ్రామాల్లో ల్యాండ్‌పూలింగ్ కింద ఇచ్చిన భూములకు సంబంధించి ఒకే గ్రామంలో ప్లాట్లను కోరేవీలులేదు. విడివిడిగానే పొందాల్సి ఉంటుంది. వాణిజ్య నివాస స్థలాల్లో సిఆర్‌డిఎ కేటాయింపుల ప్రకారమే ప్లాట్లు కేటాయిస్తారు. భూమిపైన మార్కింగ్ చేసిన 30 రోజుల్లో రైతులకు అప్పగిస్తారు. అభివృద్ధి హక్కు బడలాయింపు పత్రం (టిడిఆర్) ప్రకారం ఆ ప్రాంతంలో మార్కెట్ విలువ ఆధారంగా నిర్ణయించి రైతులకు చెల్లింపులు జరుపుతారు.