ఆంధ్రప్రదేశ్‌

ఇసుక దందాపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 28: రాష్ట్రంలో ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర గనుల శాఖ మంత్రి సుజయ కృష్ణ రంగారావు స్పష్టం చేశారు. ఇసుక మాఫియా కట్టడిపై, ఇసుక విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రివర్గ ఉప సంఘం వెలగపూడి సచివాలయంలో శుక్రవారం సమావేశమైంది. ఉప ముఖ్యమంత్రులు కెఇ కృష్ణమూర్తి, చినరాజప్ప, గనుల శాఖ మంత్రి సుజయ, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, హోం, విజిలెన్సు, మైనింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణా నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం మంత్రి సుజయ మాట్లాడుతూ ఇసుకపై గుత్త్ధాపత్యాన్ని సహించబోమని తెలిపారు. ఇసుకను ఎవరైనా తీసుకువెళ్లే వీలు ఉందని, దానిని కాదని కొంతమంది తమ ఆధీనంలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవన్నారు. ఇసుక అక్రమాలపై ఇప్పటి వరకూ నాలుగు వేల ఫిర్యాదులు వచ్చాయని, 189 కేసులు నమోదైనట్లు తెలిపారు. 257 మందిని అరెస్టు చేయగా, 465 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. 337 చోట్ల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, 212 చోట్ల సాధారణ ప్రజలను ఇసుక తవ్వకుండా బెదిరిస్తున్నారన్న సమాచారం ప్రభుత్వం వద్ద ఉందన్నారు. ఈ వ్యవహారాలపై దృష్టి సారించనున్నట్లు ప్రకటించారు. ఇసుక రీచ్‌ల పర్యవేక్షణ బాధ్యతలను స్వయం సహాయక బృందాలకు అప్పగించే యోచన ఉందన్నారు. విశాఖ వంటి నగారాల్లో ఇసుకకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రోబో ఇసుక ఉత్పత్తికి ముందుకు వచ్చే వారికి ప్రోత్సహించేందుకు నిర్ణయించినట్టు తెలిపారు.

చిత్రం..వెలగపూడిలో సమావేశంమైన మంత్రులు కెఇ, సుజయ, రాజప్ప