ఆంధ్రప్రదేశ్‌

ఆనందం ఆవిరి.. గ్రామం కన్నీటి సంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం/గుత్తి/గుంతకల్లు, ఏప్రిల్ 28: తెల్లారితే శనివారం.. పవిత్రమైన రోజు.. గ్రామంలో నిర్మించిన శ్రీరాముడి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ.. ఆలయ నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రామంలో చాలా రోజుల నుంచి ఉత్సవ కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతున్నాయి. ఇంటింటా భక్తిప్రపత్తులతో సంబరాలకు సిద్ధమయ్యారు. గ్రామంలో సందడి నెలకొంది. బంధువులు, ఆత్మీయులు, స్నేహితుల రాకతో ప్రతి ఇళ్లూ కళకళలాడుతోంది. అందరిలానే తిర్లయ్యగారి సుంకన్న కుమారుడు రాముడు ఆహ్వానంతో బంధువులందరూ అతని ఇంటికొచ్చారు. వీరిలో గుంతకల్లు, మిట్టమీద దంచర్ల, పించలపాడు, వైటి చెరువు తదితర గ్రామాల వారున్నారు. తల్లిదండ్రులతో వచ్చిన పిల్లలు, తల్లీకూతుళ్లు, తండ్రీ కొడుకులు, కూతుళ్లు ఇలా అంతా వచ్చారు. సాయంత్రం కావడంతో కొంతమంది కలిసి సరదాగా చెరువు గట్టుపైకి చేరుకున్నారు. చేపలు పట్టేందుకు మత్స్యకారులు ఏర్పాటు చేసుకున్న తెప్ప వారికి కనిపించింది. చెరువులో అలా సరదాగా తిరిగొద్దామని అనుకున్నారు. బెస్త రాజు, బోయ రాజు ఓ తెప్పలో రెండు విడతలుగా ఓసారి ఏడుగురిని, రెండోసారి 8 మంది చొప్పున గుట్టపై వదిలారు. కొద్దిసేపు సరదాగా గడిపిన వారు తిరుగుప్రయాణంలో అంతా కలిసి తెప్ప ఎక్కారు. అసలే అది చిన్న తెప్ప.. పరిమితంగా ఐదారుగురు మించి వెళ్లకూడదు. అలాంటిది ఏకంగా 17 మందితో గట్టువైపునకు నిదానంగా నిండు గర్భిణిలా బయలేదేరింది. కొంత దూరం వచ్చాక తెప్ప బరువైందో, లేక ఓవైపు ఒరిగిందో.. పిల్లల సరదాగా నీటిని చేతులతో చల్లకుంటూ ఉన్నారో గానీ.. మృత్యువు వికటాట్టహాసం చేసింది. పంజా విసిరింది. ఎవరూ ఊహించని రీతిలో తెప్ప తిరగబడింది. అంతే.. క్షణాల్లో అందరూ నీటిలో పడిపోయారు. వారిపై తెప్ప పడింది. హాహాకారాలు మిన్నంటాయి. ఎవరికీ ఈత రాకపోవడంతో నీట మునిగారు. గట్టుపైన ఎవరూ లేరు. కేకలు వేసినా, ఆర్తనాదాలు చేసినా అరణ్యరోదనే అయింది. తెప్ప నడిని బెస్త రాజు, బోయ రాజు ఈదుకుంటూ బయటకు వస్తుండగా నీటిలో మునిగిపోతున్న ఐదేళ్ల సుమిత్ర కనిపించింది. దీంతో చెరోరెక్క పట్టుకుని తమ వెంట గట్టుకు చేర్చారు.
తమవారు నీట మునిగిపోయినట్లు తెలియగానే వైటిచెరువు తల్లిడిల్లింది. గ్రామం మొత్తం చెరువు వద్దకు చేరుకుంది. నీళ్లలో మునిగిన వారి కోసం బంధువులు గాలింపుచర్యలు చేపట్టారు. ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటపడడంతో గొల్లుమన్నారు. ఎంత ఘోరం జరిగిందంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. మృత్యువు బిగి కౌగిలిలో 13 మంది ఊపిరాడక గంగమ్మకు బలైపోయారు. ఒక్కొక్క శవాన్ని చెరువు గట్టుపైకి చేరుస్తుండటంతో చూస్తున్నవారి గుండెలు చెరువువయ్యాయి. కన్నీరుధారగా కారుతుంటే కంటికి మింటికి విలపించారు. దేవుడా.. నిన్ను చూసేందుకు మేమొస్తే.. ఇలా చేశావేమయ్యా.. ఏమి పాపం చేశారంటూ గొల్లుమన్నారు. ఊరు వల్లకాడును తలపించింది. గుట్టలుగా శవాలు పడి ఉండటాన్ని చూసి గుండెలవిసేలా రోదించని వారు లేరు. గ్రామంలో రోదనలు మిన్నంటాయి. పండుగ వాతావారణం కాస్త విషాదమయమైంది. వర్షంలోనే సహాయక చర్యలకు పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖలతో పాటు గ్రామస్తులు ముమ్మరం చేశారు. జోరుగా కురుస్తున్న వర్షం.. ఆ వర్షంలో తడుస్తున్న మృతదేహాలు.. వాటిని ఈ దుస్థితిలో చూడలేక ఏడుస్తున్న జనం.. గ్రామం విషాదమమైంది.