రాష్ట్రీయం

నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియా

హైదరాబాద్, ఏప్రిల్ 29: దేశంలో యువతకు అవసరమైన నైపుణ్యాలను పెంచేందుకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా పేర్కొన్నారు. స్వర్ణ్భారతి ట్రస్టులో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన పనగరియా మాట్లాడుతూ ప్రధాని ఆలోచనలు, ఆశయాలకు రూపమివ్వడమే నీతిఆయోగ్ పని అన్నారు. భారత్‌ను శక్తివంతమైన దేశంగా తయారుచేయాలన్నదే మోదీ ఆకాంక్ష అని అంటూ, నైపుణ్యాభివృద్ధికే నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైందని, ప్రణాళికా నిధుల కేటాయింపుల్లో నైపుణ్యాభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. అన్నదాతకు తోడ్పాటు, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఎరువులు, పురుగుమందుల వినియోగం, సూక్ష్మసేద్యం, కొత్త రకాల పంటలు, వ్యవసాయంలో నూతన సాంకేతిక పద్ధతులను అవలంభించడంలో రైతులను చైతన్య పరిచే కార్యక్రమాలను ట్రస్టు నిర్వహించడం అభినందనీయమన్నారు. శిక్షణ పొందిన వారు భవిష్యత్‌లో సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చని, కఠిన శ్రమతోనే విజయం సాధించగలుగుతారని ఉద్బోధించారు. కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు, ట్రస్టీ దీపా వెంకట్, గ్లోబల్ హాస్పిటల్స్ చైర్మన్ రవీంద్రనాథ్, ట్రస్టు హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్, కళింగ ఇనిస్టిట్యూట్ చైర్మన్ అచ్యుత సామంత సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

చిత్రం... స్వర్ణ్భారతి ట్రస్టు సేవలను పనగరియాకు వివరిస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్య