ఆంధ్రప్రదేశ్‌

అమరావతిపై ‘మాకీ’ ఆరోపణలు అవాస్తవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 30: నవ్యాంధ్ర రాజధాని అమరావతి డిజైన్ల పై మాకీ అండ్ అసోసియేట్స్ సంస్థ చేసిన ఆరోపణలు అవాస్తవమని, సిఆర్‌డిఎ పై నిరాధార ఆరోపణలు చేసిన ఆ సంస్థపై న్యాయపరమైన చర్యలు తీసుకొనేందుకు కసరత్తు చేస్తున్నట్టు ఎపిసిఆర్‌డిఎ పేర్కొంది. మాకి సంస్థ ఆరోపణలపై స్పందించిన సిఆర్‌డిఎ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ త్వరలోనే మాకీ సంస్థకు లీగల్ నోటీసులను జారీ చేసేందుకు నిర్ణయించినట్టు ఎపి సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ పేర్కొన్నారు. మాస్టర్ ఆర్కిటెక్ట్ ఎంపిక కోసం అంతర్జాతీయ పోటీలో పాల్గొన్న మాకీ అండ్ అసోసియేట్స్ తెలుగు ప్రజల మనోభావాలకు అనుగుణంగా లేకపోవడంతోపాటు తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా డిజైన్ల రూపకల్పనలో విఫలమైన ఆ సంస్థ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సిఆర్‌డిఎపై అంతర్జాతీయంగా నిరాధారమైన ఆరోపణలను చేస్తోందన్నారు. మార్చి 21వ తేదీన మాకి సంస్థ ఆర్కిటెక్చరల్ డిజైస్ట్‌లో ప్రచురించిన కథనంలో ఆరోపణలు చేస్తూ బిహార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య పోలికలను తెస్తూ చేసిన అభియోగాలను సిఆర్‌డిఎ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మాకీ సంస్థ చేసిన డిజైన్లపై తెలుగు ప్రజల తోపాటు నిపుణులు, మీడియా, సోషల్ మీడియాలలో వ్యతిరేకత వచ్చినందున ఆ డిజైన్లను తిరస్కరించడం జరిగిందన్నారు. డిజైన్ల రూపకల్పనకు మాకీ సంస్థ 87 కోట్లను కోట్ చేయగా ప్రస్తుతం డిజైన్ అందించిన ఫాస్టర్ ప్లస్ పార్టనర్స్ కేవలం 60.72 కోట్లకు కోట్ చేయడంతో ఫాస్టర్స్ ప్లస్ పార్టనర్స్‌ను ఎంపిక చేశామన్నారు. వాస్తవాలకు దూరంగా ఉన్న మాకీ సంస్థ ఆరోపణలు, అసత్య ప్రచారాలు సిఆర్‌డిఎ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉన్నందున వారిపై లీగల్ నోటీసుల జారీకి సన్నాహాలు చేస్తున్నామని, ఇటువంటి చర్యలు ఆ సంస్థ అంగీకరించి, సంతకం చేసిన ఒప్పందం గౌరవానికి భంగకరంగా ప్రవర్తించడం సరైంది కాదని ఆయన హెచ్చరించారు.