ఆంధ్రప్రదేశ్‌

పట్టణ ఆరోగ్య కేంద్రాలపై ప్రచారమేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 1: రాష్ట్రంలో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సరైన ప్రచారం లేక ఆదరణకు నోచుకోవడం లేదు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పదే పదే చెబుతున్నప్పటికీ నిర్వాహకులు కనీస శ్రద్ధ కనబరచడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన రెండు సమీక్ష సమావేశాల్లోనూ మంత్రి ఈ ఆరోగ్య కేంద్రాల నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. పట్టణాల్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల స్థానంలో ముఖ్యమంత్రి పట్టణారోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఆ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంతమాత్రంగా ఉండటంతో ఎక్కువ మంది వెళ్లడం లేదు. దీనికి తోడు ఇక్కడ ఆరోగ్య కేంద్రం ఉన్నట్లుగా తెలిపే బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ప్రకటనల్లో ఉన్నంత హడావుడి వాస్తవంలో లేకపోవడం మంత్రి దృష్టికి వచ్చింది. అయినా అక్కడి పరిస్థితిలో పెద్దగా మార్పులేదన్న విషయం సోమవారం వెలగపూడి సచివాలయంలో పట్టణారోగ్య కేంద్రాల నిర్వహణపై నిర్వహించిన సమీక్షలో వెల్లడైంది. ఈ ఆరోగ్య కేంద్రాల ద్వారా పట్టణ ప్రజలకు మేలైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇటీవల రాజమండ్రిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసినప్పుడు డిస్‌ప్లే బోర్డులు లేకపోవడం, ఓపి తక్కువగా ఉండటం గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రాల బోర్డులు పెద్దగా ఉండాలని, టెలిమెడిసిన్ విధానంలో స్పెషలిస్టుల సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఒపి తక్కువగా ఉంటే సర్వీస్ ప్రొవైడర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.