ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ ప్రైవేటీకరణకు బాబు యత్నాలు:జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 1: ముఖ్యమంత్రి చంద్రబాబు రైతాంగ, కార్మిక వ్యతిరేకి అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. కాంట్రాక్టు కార్మికులు ఎన్నో ఏళ్లుగా కనీస వేతనాలకు కూడా నోచుకోకుండా పనిచేస్తున్నా ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు జీహుజూర్ అంటోందని ఆరోపించారు. మేడే వేడుకల్లో భాగంగా వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు బాబు కుట్ర పన్నుతున్నారని, తమ పార్టీకి చెందిన ఎంపిలు కేశినేని నాని, జెసి దివాకర్‌రెడ్డి ట్రావెల్స్‌కు ఆర్టీసీని తాకట్టుపెట్టే దిశగా మంతనాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోని పలు సంస్థలను మంత్రి నారాయణకు కట్టబెట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంట్రాక్టు కార్మికులను కడుపుకొట్టి కార్పొరేట్ శక్తులకు మోకరిల్లుతున్న చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలన్నారు.