ఆంధ్రప్రదేశ్‌

రైతుల ఇంట సిరుల పంటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 25: రాష్ట్ర రాజధాని అమరావతి నగరంపై దేశ విదేశీ సంస్థలు, పెట్టుబడిదారుల కళ్లన్నీ ఉండటంతో ఇక ఈప్రాంత భూములు రైతుల ఇంటి సిరులు పండించనున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే సంఘ వ్యతిరేక శక్తుల వలలో పడి ఏ చిన్న ఆందోళన చేపట్టినా పెట్టుబడిదారులంతా వెనుదిరిగితే తీవ్రంగా నష్టపోయి కృష్ణానదిలో దూకాల్సిన పరిస్థితులు ఎదురవుతాయంటూ కూడా ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
అభివృద్ధి లేకపోయినా భూములన్నీ ప్రభుత్వం చేతిలోకి వెళ్లినందున ఎటూ వెనుదిరిగి రావనేది రైతులు గుర్తెరగాలన్నారు. పంట భూముల్లో రాజధాని వల్ల భవిష్యత్‌లో ఆహార భద్రతకు ముప్పు వస్తుందనే బెదిరింపులతో పాటు ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలు సరికావని ఖండించారు. గోదావరి నీరు మళ్లింపు వల్ల రాయలసీమ రతనాల సీమకానుందని, దీనివల్ల పండ్లతోటలు వృద్ధి చెంది ఎకరాకు లక్ష రూపాయలకు పైగా రైతుకు లాభం చేకూరనుందని సోమవారం ప్రభుత్వ తాత్కాలిక పరిపాలనా భవన సముదాయం ప్రారంభ సభలో చంద్రబాబు అన్నారు. కొందరికి రాజధాని నిర్మాణం జరగటం, రైతుల భూములు, స్థలాల విలువ పెరగటం ఏమాత్రం ఇష్టం లేదన్నారు. బవిష్యత్‌లో అమరావతి వాసులు చేతినిండా డబ్బుందికదా అని సాయంత్రానికి మద్యం, ఇతర అలవాట్లకు బానిసలై నష్టపోవద్దంటూ హితవు చెప్పారు. ప్రతి పైసాను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చంద్రబాబు సలహా ఇచ్చారు. రాజధాని ప్రాంతంపై దుర్మార్గుల దిష్టి పడరాదనే దేశ, విదేశీ పవిత్ర స్థలాల నుంచి సేకరించిన పవిత్ర మట్టి, జలాలతో సంప్రోక్షణ చేశామన్నారు.
భూసమీకరణ అంగీకరించని రైతుల భూములను భూసేకరణ చట్టం ప్రకారం సేకరించడం ఖాయమని, దీనివల్ల పూర్తిగా నష్టపోతారంటూ హెచ్చరించారు. అందుకే భూసేకరణ నోటిఫికేషన్ వచ్చేలోగా భూములు అప్పగిస్తే ఇతరులతో పాటు ప్రయోజనాలన్నీ దక్కుతాయని చెప్పారు. కృష్ణానదీ తీరం, కరకట్ట వెంబడి ఏ ఒక్కరి భూమిని కూడా మినహాయించేది లేదంటూ, చివరకు తాను నివసిస్తున్న ఇల్లు లింగమనేని రమేష్‌ది కాదని, ఏనాడో ప్రభుత్వపరమైందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రెండు నెలల వ్యవధిలో ప్రతి ఇంటికీ కేవలం రూ.149లకే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నామని, ఇందువల్ల వినోదంతో పాటు సమాచార విప్లవం ద్వారా విజ్ఞాన సముపార్జనకు వీలవుతుందన్నారు. టెక్నాలజీతో ఇక విద్యుత్ చౌర్యం జరగకుండా అడ్డుకుంటామని, నీటిమీటర్లు ఏర్పాటు చేసి దళారుల బెడదను తొలగిస్తామని చెప్పారు. తనపై నమ్మకంతో భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నానంటూ పదేపదే పేర్కొన్నప్పుడు ఓ రైతు అడ్డుతగిలాడు. ‘దీనివల్ల మాకేమిటి ప్రయోజనం? ఇప్పటివరకు ఎలాంటి కమిటీలోనూ రైతు ప్రతినిధులను సభ్యులుగా నియమించలేదు. అసలు ఎప్పుడు ఏమి జరుగుతున్నదో మాకెవరికీ తెలియటం లేదు’.. అని ఆ రైతు ఆక్రోశం వెళ్లగక్కినపుడు ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాణువయ్యారు.