ఆంధ్రప్రదేశ్‌

బాబు పర్యటనకు అమెరికాలో ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 2: ముఖ్యమంత్రి చంద్రబాబు కాలిఫోర్నియా పర్యటనపై ఎన్నారై టిడిపి, ఎపి జన్మభూమి ఆధ్వర్యంలో మిల్‌పిటాస్‌లోని ఎపి జన్మభూమి ఆఫీస్ (ఎన్నారై స్పెషల్ రిమ్రపెజంటేటివ్ ఆఫీస్) మంగళవారం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మే 4న సిఎం శాన్‌జోస్‌కు వస్తున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించి స్వాగత ఏర్పాట్లు, రిసెప్షన్ వంటి ఇతర విషయాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు ఎన్నారైలు టిడిపి అభిమానులు, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికే చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఎన్‌ఆర్‌ఐలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.