ఆంధ్రప్రదేశ్‌

టెక్నాలజీతో బిసీల అభ్యున్నతికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 2: టెక్నాలజీని ఉపయోగించి బిసిల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో చేతివృత్తులకు సంబంధించి 12 ఫెడరేషన్ల సభ్యులు బిసి నేత డి రామారావు నేతృత్వంలో మంగళవారం మంత్రిని కలిసి సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బిసిల సంక్షేమంలో భాగంగా ఆదరణ పథకం అమలు చేశామని, అయితే మరింత మెరుగైన విధానంలో మళ్లీ ఆ పథకాన్ని అమలు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రతి వ్యక్తీ ఆర్థికాభివృద్ధి సాధించేలా తమ శాఖ కృషి చేస్తుందని, బడుగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టుకే వెనుకబడిన తరగతుల పునాదులపై జరిగిందని, బిసిలంటే టిడిపి, టిడిపి అంటే బిసిగా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. ఏ వర్గానికీ నష్టం జరగకుండా కాపులను బిసి జాబితాలో చేరుస్తామని, అన్ని వర్గాల అభివృద్ధిని కాంక్షిస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించాలని పిలుపునిచ్చారు. చేతి, కులవృత్తుల వారికి బ్యాంకులు రుణాలివ్వడాన్ని గమనించి కౌంటర్ గ్యారంటీ ఇచ్చేందుకు కేంద్రాన్ని ఒప్పించామని, దాదాపు రూ.150 కోట్ల మేరకు ఈ పద్ధతిలో రుణాలిచ్చే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాల వారీగా బిసి గర్జనలను ఏర్పాటు చేస్తామని, విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి హాస్టళ్లకు మరమ్మతులు చేయించాలని నిర్ణయించామన్నారు. హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీల పెంపుదల అంశం కూడా పరిశీలనలో ఉందని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు.

చిత్రం..బిసి ఫెడరేషన్ల సభ్యులు కలిసిన సందర్భంగా మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు