ఆంధ్రప్రదేశ్‌

స్థానిక సంస్థల అభివృద్ధికి అలుపెరగని కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 2: స్థానిక సంస్థల అభివృద్ధికి అలుపెరగని కృషి చేస్తామని శాసనమండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు, అంగర రామ్మోహనరావు తెలిపారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన చిక్కాల రామచంద్రరావు, అంగర రామ్మోహనరావు శాసనమండలి సభ్యులుగా మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని బిఎసి సమావేశం గదిలో వారిద్దరితో శాసనమండలి చైర్మన్ చక్రపాణి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్సీలు రామచంద్రరావు, రామ్మోహనరావు విలేఖర్లతో మాట్లాడారు. ముందుగా ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు మాట్లాడుతూ, శాసనమండలి సభ్యునిగా రెండోసారి బాధ్యతలు చేపట్టానన్నారు. వెనుకబడిన తరగతులకు పార్టీ ఎంతో ప్రోత్సాహమిస్తోందన్నారు. ఇందుకు తనకు రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశమివ్వడమే పెద్ద ఉదాహరణన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి ఇతర ప్రజా ప్రతినిధులతోకలిసి పనిచేస్తానన్నారు. మరో ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధికి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో కలిసి కృషి చేస్తానన్నారు. ఇప్పటివరకూ 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు మంత్రి ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లో పనిచేశానన్నారు. ప్రజలు దేవుళ్లు, సమాజమే దేవాలయం అని బోధించిన దివంగత ఎన్టీరామారావు చూపిన బాటలో విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నానన్నారు. 13 ఏళ్ల నుంచి ఎటువంటి పదవులు చేపట్టలేదని, అయినా తనను గుర్తుపెట్టుకుని ఎమ్మెల్సీగా అవకాశమిచ్చిన సిఎం చంద్రబాబు నాయుడికి, మంత్రి లోకేష్‌కు ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రాలు..ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎమ్మెల్సీలు చిక్కాల, అంగర