ఆంధ్రప్రదేశ్‌

మిర్చికి అందని ‘మద్దతు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 4: మద్దతు ధర లేదంటూ రోడ్డెక్కిన మిర్చి రైతును ఆదుకుంటామన్న రాష్ట్ర ప్రభుత్వ తీరు ప్రచారార్భాటంగానే మారింది. లక్షల సంఖ్యలో మిర్చి టిక్కీలు మార్కెట్ యార్డుల్లో మూలుగుతుంటే, కొనుగోళ్లు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. మిర్చి రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో గడచిన రెండు వారాల్లో కేవలం 24 మంది రైతులకే లబ్ధి చేకూరింది. కేవలం 5.74 లక్షల రూపాయలను రైతులకు మద్దతు ధర కింద చెల్లించారు. గత ఏడాదితో పోలిస్తే మిర్చి ధర గణనీయంగా పడిపోయింది. గత ఏడాది 10 వేల రూపాయల వరకూ ధర పలుకటంతో, ఈ ఏడాది మిర్చిని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. దీంతో దిగుబడులు మెరిగి, మిర్చి ధర అమాంతం పడిపోయింది. ప్రస్తుతం క్వింటాల్‌కు మూడు వేల రూపాయలు కూడా లభించని పరిస్థితి రైతులకు కన్నీరు తెప్పిస్తోంది. వ్యాపారులు కుమ్మక్కై సరైన ధర లభించకుండా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు మార్కెట్ యార్డు సిబ్బంది కూడా పట్టించుకోవడంతో రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. కోల్డ్ స్టోరేజీ గోదాములు కూడా ఖాళీ లేకపోవడంతో రైతుకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో మద్దతు ధరను చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. క్వింటాల్‌కు 1500 రూపాయల చొప్పున ఒక్కో రైతుకు గరిష్ఠంగా 20 క్వింటాళ్లకు అదనంగా చెల్లించేందుకు నిర్ణయించింది. మార్కెట్ యార్డులో రైతు విక్రయించిన ధరను గమనించి, అదనంగా మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. మొత్తం ధర క్వింటాల్‌కు 8000 రూపాయలకు మించకుండా ఈ మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏప్రిల్ 20 నుంచి మిర్చి రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు నిర్ణయించింది. ప్రకటించి రెండు వారాలు కావస్తున్నా, గురువారం సాయంత్రానికి 24 మంది రైతులు మాత్రమే మద్దతు ధర కింద లబ్ధిపొందారు. గురువారం 13 మందికి చెల్లించారు. ఇప్పటి వరకూ 24 మంది రైతులకు మాత్రమే గరిష్ఠంగా 20 క్వింటాళ్లకు 5.74 లక్షలు చెల్లించారు. గుంటూరు మిర్చి యార్డులో లక్షల కొద్దీ టిక్కీల మిర్చి నిల్వలు పేరుకుపోగా, ప్రభుత్వం మాత్రం కేవలం కొద్ది మందికే మద్దతు ధర లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. మద్దతు ధర చెల్లింపునకు ప్రభుత్వ సూచించిన మార్గదర్శకాల వల్ల జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగం అంతా ఎందుకన్న అభిప్రాయంతో కొంతమంది రైతులు యార్డు బయట దళారులకు అమ్ముకుంటున్నారు. ఏదేమైనా నిబంధనలను సరళీకృతం చేసి, రైతులకు మద్దతు ధర చెల్లింపు విధానంపై ముందుగానే అవగాహన కల్పించాల్సి ఉంది.