ఆంధ్రప్రదేశ్‌

ఎంసెట్ ఫలితాలు నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 4: ఎపి ఎంసెట్-2017 ఫలితాలను విజయవాడలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. విజయవాడలోని రాష్ట్ర అతిథి గృహంలో ఫలితాలను రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, డాక్టర్ కామినేని శ్రీనివాస్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సిహెచ్ ఆదినారాయణరెడ్డి తదితరులు విడుదల చేస్తారని ఎంసెట్ కన్వీనర్, జెఎన్‌టియుకె రిజిస్ట్రార్ ఆచార్య సిహెచ్ సాయిబాబు చెప్పారు. ఎంసెట్ ఫలితాలు వెల్లడైన అరగంట తర్వాత ర్యాంకులను సంక్షిప్త సందేశం (ఎస్‌ఎంఎస్) ద్వారా విద్యార్థుల ఫోన్ నంబర్లకు తెలియజేస్తామన్నారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలను ఏప్రిల్ 24,25,26 తేదీలలో నిర్వహించగా ఈ పరీక్షలకు 1 లక్ష 87వేల 454 మంది హాజరయ్యారు. అగ్రికల్చర్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలను ఏప్రిల్ 28వ తేదీ నిర్వహించగా, 75,381 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఎంసెట్‌ను తొలిసారిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించారు. ఎంసెట్ ఫలితాల వెల్లడించిన వెంటనే ఆయా వెబ్‌సైట్లలో ఉంచుతారు. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎస్‌సిహెచ్‌ఇ.ఎపి.జిఒవి.ఇన్/ ఎంసెట్ వైబ్‌సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని కన్వీనర్ డాక్టర్ సాయిబాబు చెప్పారు.