జాతీయ వార్తలు

పరిష్కారకర్త నరేంద్ర మోదీనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశ్మీర్ సమస్యపై మెహబూబా స్పష్టం
ఆయన నిర్ణయానికి దేశం మద్దతిస్తుంది
సమస్య పరిష్కారానికి సరైన సమయమిదే
జమ్ములో ఫ్లై ఓవర్ ప్రారంభించిన సిఎం

జమ్ము, మే 6: కాశ్మీర్ సమస్యకు ప్రధాని మోదీ మాత్రమే పరిష్కారాన్ని చూపించగలరని జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ అన్నారు. ఆయనకు బలమైన ప్రజా మద్దతు ఉందని ఆమె వ్యాఖ్యానించారు. కాశ్మీర్ లోయలో అస్థిరతకు, అనిశ్చితికి మాజీ ప్రధానమంత్రి అటల్‌బిహారీ వాజపేయి కొనసాగించిన దౌత్య ప్రక్రియను ఆ తరువాత వచ్చిన యూపిఏ సర్కారు ముందుకు తీసుకుని వెళ్లకపోవడమే కారణమని ఆమె ఆరోపించారు. ‘ఈ రోజు నేను సాధికారికంగా చెప్తున్నా. జమ్ము కాశ్మీర్ సమస్యకు ఎవరైనా పరిష్కారం చూపించగలరంటే, అది ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రమే. ఆయనకు బలమైన ప్రజా తీర్పు ఉంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దేశం ఆయన్ను సమర్థిస్తుంది.’’ అని ఆమె అన్నారు. జమ్ములో శనివారం ఆమె ఒక ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. 2002లో తన తండ్రి ముఫ్తీ మహమ్మద్ సరుూద్, అప్పటి ప్రధాని వాజపేయి కాశ్మీర్‌లో శాంతి ప్రయత్నాలను ప్రారంభించారని, కానీ ఆ తరువాత జమ్ముకాశ్మీర్‌ను ఏలిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో అప్పటి యుపి ఏ ప్రభుత్వం ఆ ప్రక్రియను ముందుకు తీసుకుపోవటంలో విఫలమైందని పరిస్థితిని చక్కదిద్దటానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆమె విమర్శించారు. 2015 డిజెంబర్ 25న ప్రధాని మోదీ లాహోర్ పర్యటనను ఆమె సమర్థించారు. ఆయన పాక్ ప్రధానిని కలవటానికి వెళ్లారని, అది బలహీనత ఎంతమాత్రం కాదని ఆమె అన్నారు. మోదీ కంటే ముందు ప్రధానిగా ఉన్న మన్మోహన్‌సింగ్ పాకిస్తాన్ వెళ్లాలనుకున్నా, ధైర్యం చేయలేకపోయారని ఆమె అన్నారు. ‘‘మోదీజీ కంటే ముందు ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్‌సింగ్ పాకిస్తాన్ వెళ్లాలని, అక్కడ తమ పూర్వికుల ఇల్లు చూసి రావాలని కోరుకున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ, అక్కడికి వెళ్లటానికి ఆయనకు ధైర్యం చాలలేదు’’ అని ఆమె అన్నారు.

చిత్రం... జమ్ములో ఫ్లై ఓవర్‌ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి మెహబూబా