ఆంధ్రప్రదేశ్‌

నేడే నీట్ ఉదయం 9.30 దాటితే అనుమతి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం 9.30 దాటితే అనుమతి లేదు

కుర్తా, పైజామా, ఫుల్‌హ్యాండ్స్ షర్ట్ నిషేధం
అమ్మాయిలు హై హీల్స్ వేసుకోకూడదు
నీట్ పరీక్షకు ఆంక్షలు గ్రూప్-1 ప్రిలిమ్స్ కూడా నేడే!

విజయవాడ, మే 6: విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్దే కీలకమైన ఎపిపిఎస్‌సి గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలి మ్స్, అలాగే వైద్యవిద్యకు సంబంధించిన జాతీయస్థాయి పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఆదివారం జరగబోతున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు 13 జిల్లాల్లో 174 పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఈ పరీక్ష కోసం 93,482 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా విశాఖ జిల్లా నుంచి 12,498 మంది, విజయనగరం జిల్లా నుంచి అత్యల్పంగా 3,371 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అత్యధిక దరఖాస్తుల్లో గుంటూరు, కృష్ణా, కర్నూలు, తూ.గో, చిత్తూరు జిల్లాలు వరుస క్రమంలో ఉన్నా యి. ప్రిలిమ్స్ నుంచి 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మొత్తం 78 పోస్టుల్లో 5 డెప్యూటీ కలెక్టర్లు, 13 కమర్షియల్ టాక్స్ అధికారులు, 6 జిల్లా రిజిస్ట్రార్లు, 24 డిఎస్పీ, 10 ఎక్సైజ్ డిఎస్పీ, రెండు జిల్లా బిసి సంక్షేమ అధికారులు, 8 మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 పోస్టులు, 10 కార్మిక శాఖ ఉప కమిషనర్ పోస్టులున్నాయి. ఈ పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. ఇక నీట్ పరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా జరుగుతుంది. మొత్తం 11,35,104 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షా 50వేల మంది అభ్యర్థులున్నారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖ, తిరుపతి, గుంటూరు నగరాల్లో, తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇదిలావుంటే, విద్యార్థులు ఉదయం 7.30 గంటలకల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సిబిఎస్‌ఇ సూచించింది. 9.30 తర్వాత ఎవరినీ అనుమతించబోరని కూడా స్పష్ట చేసింది. ముఖ్యంగా వస్తధ్రారణ విషయంలో కచ్చితమైన నిబంధనలను అమల్లోకి తెచ్చారు. అభ్యర్థులు కుర్తా- పైజామా, ఫుల్ హ్యాండ్స్ షర్ట్ ధరించకూడదు. తెలుపు జీన్స్ ప్యాంట్లు, హాఫ్ హ్యాండ్స్ షర్ట్‌లు, చెప్పులు, స్లిప్పర్లు మాత్రమే ధరించాలి. అమ్మాయిలకు పూసలు, తదితర రంగుల వస్త్రాలు, హైహీల్స్‌ను నిషేధించారు. గత ఏడాది నీట్ నిర్వహణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో తాజా ఆంక్షలను విధించారు. ఆంక్షల నేపథ్యంలో మహిళలు ఎలాంటి ఆభరణాలు కూడా ధరించరాదని ఆదేశించారు. ఏడాది క్రితం జరిగిన పరీక్షల్లోనూ పలు కేంద్రాల వద్ద దీనిపై వివాదం రేగింది. వివాహితలు మంగళసూత్రాలు తొలగించాలనటంపై నాడు ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.