తెలంగాణ

సింగరేణి.. నిప్పుల కుంపటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ జిల్లాలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత ఓపెన్‌కాస్టు కార్మికుల పనివేళల్లో మార్పు

ఆదిలాబాద్, మే6: ప్రచండమైన ఎండలకు తోడు దడ పుట్టించే వడగాలులకు ఆదిలాబాద్ ఉడికిపోతోంది. రెండు మూడు రోజులుగా వాతావరణం చల్లబడి ఊరటనిచ్చినా శనివారం భానుడు ఉగ్రరూపం దాల్చడంతో సామాన్య జనం అల్లాడిపోయారు. ఆదిలాబాద్ జిల్లాలోని సింగరేణి ప్రాంతాలైన మంచిర్యాల, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, ఖైరిగూడలో రికార్డుస్థాయిలో 45.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, ఉట్నూరు ఏజెన్సీల్లో 45.4 డిగ్రీల ఉషోణ్రగత రికార్డయింది. ఈ ఏడాది వేసవిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రతగా వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలావుంటే తీక్షణమైన వడగాలులకు జనం బెంబేలెత్తుతుండగా వారం రోజుల్లోనే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎనిమిది మంది వడదెబ్బ సోకి మృత్యువాత పడటం కలకలం సృష్టిస్తోంది. భీకరమైన ఎండల తీవ్రతకు జనం ఇంటి గడపదాటి బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొనగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, భైంసా పట్టణాలు పగటివేళల్లో నిర్మానుష్యమైన జనంతో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. కాగా సింగరేణి బొగ్గు గనుల్లో ఎండల తాకిడికి కార్మికుల హాజరుశాతం పడిపోతుండగా భానుడి ప్రతాపానికి ఎండదెబ్బ సోకి మంచం పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం సర్‌ఫేస్ షిప్ట్ పద్ధతి కింద ఉపరితల బొగ్గు గనుల్లో పనిచేసే సింగరేణి కార్మికుల పనివేళలను మార్చడమే గాక పగటి వేళల్లో ఒక గంట పనిసమయాన్ని తగ్గించడం గమనార్హం. శనివారం నుండే తెలంగాణలోని అన్ని ఓపెన్‌కాస్టు గనుల్లో గంటసేపు పనివేళలను కుదించడమే గాక షిప్ట్ పద్దతిలో పనివేళలను మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఖైరిగూడ ఓసి1, ఓసి3, ఓసి4, శ్రీరాంపూర్, ఎం కె మైన్స్‌తో పాటు మనుగూరు, కొత్తగూడెం, డోర్లి, భూపాలపల్లి, రామగుండం ఓసి1, ఓసి3, ఓసి4, జికె ఓపెన్‌కాస్టు గనుల్లో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి షిప్ట్‌లో పనివేళలను మారుస్తూ ఉత్తర్వులు జారీ వెలువడగా రెండో షిప్ట్‌లో సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు, మూడో షిప్ట్‌లో రాత్రి 11 నుండి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు పనివేళలను మార్చారు. వేసవి కాలం పూర్తయ్యే వరకు పనివేళలు ఇదేవిధంగా కొనసాగనున్నాయి. నిన్నటి వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగిన సింగరేణి గని కార్మికుల మొదటి విడత పని వేళల్లో గంట పాటు కుదించి మధ్యాహ్నం విశ్రాంతికి వెసులుబాటు కల్పించారు. ఇదిలా ఉంటే సింగరేణి గనులు అగ్ని గుండాలను తలపిస్తున్న నేపథ్యంలో ఓపెన్‌కాస్టుతో పాటు భూగర్బ గనుల్లో కార్మికుల హాజరుశాతం ఈ వేసవిలో 41శాతం తగ్గడం ఉత్పత్తిపై ప్రభావం చూపనుంది. ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు పెరిగుతున్న ఎండల తీవ్రతకు తోడు వడగాలులకు ఆస్పత్రుల పాలయ్యేవారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లో తునికాకు సేకరణ, అటవీ ఉత్పత్తులను సేకరించే గ్రామీణ కూలీలు ఎండల తాకిడికి సొమ్మసిల్లిపోతున్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరగాల్సిన జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశం ఎండల తాకిడి ప్రభావంగా సభ్యులు గైర్హాజరు కావడంతో కోరం లేక సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. మరో వారం రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు ముందు జాగ్రత్తగా వడదెబ్బ సోకకుండా చర్యలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చిత్రం... ఖైరిగూడ సింగరేణి గనిలో ఉడికిపోతున్న కార్మికులు