ఆంధ్రప్రదేశ్‌

పెట్రోలు బంకుల్లో ‘చిప్స్’తో మోసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 9: రాష్ట్రంలో ఉన్న పెట్రోలు బంకుల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అధునాతన చిప్స్ ఏర్పాటు చేసి, మోసాలకు పాల్పడుతున్నారని ర్టా పౌరసరఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అయితే అధికారుల దాడుల్లో పెట్రోల్ బంకుల అక్రమాలు బయటపడితే వాటి లైసెన్స్‌ను రద్దు చేయిస్తామని హెచ్చరించారు. మంగళవారం విజయవాడ సింగ్‌నగర్‌లోని పెట్రోలు బంకులో వినియోగదారులకు ఏ విధంగా పెట్రోల్ అందిస్తున్నది మంత్రి సమక్షంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా అప్రమత్తంగా ఉంటే పెట్రోలు బంకుల యాజమాన్యాలు మోసాలకు పాల్పడకుండా ఉంటారన్నారు. రిమోట్ ఆపరేషన్ చేయడం ద్వారా కొత్త చిప్‌ను అమర్చి మోసాలకు పాల్పడుతున్నారని మంత్రి ఒరిజినల్ చిప్‌కు, డూప్లికేట్ చిప్‌కు ఉన్న తేడాను చూపించారు. అధికారులు పెట్రోల్ బంకు పరిసరాల్లోకి రాగానే రిమోట్ ద్వారా ఆన్, ఆఫ్ సౌకర్యంతో కొత్త మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు. ఇలాంటి వాటి పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండి వినియోగదారులు మోసపోకుండా చర్యలు చేపట్టాలన్నారు. గతంలో తాము సీజ్ చేసిన గుణదల పెట్రోలు బంకులో 12 శాతం పెట్రోల్ తగ్గిందని, దీని ద్వారా 100 లీటర్ల పెట్రోల్‌కు 12 లీటర్లు పెట్రోలు తగ్గుతుందని చెప్పారు. పెట్రోలు బంకు యాజమాన్యాలు నీతి, నిజాయితీగా పనిచేయాలని, లేని పక్షంలో బంకుల లైసెన్స్‌ను ఆయిల్ కంపెనీలతో మాట్లాడి టెర్మినేట్ చేయిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న 2,600 పెట్రోలు బంకుల యజమానులు పెట్రోల్, డీజిల్‌ను సక్రమంగా అందించేలాగా చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్ అధికారులు, తూనికలు, కొలతల శాఖ అధికారులు నీతి నిజాయితీతో వ్యవహరించాలన్నారు. అధికారులు సక్రమంగా ఉంటే బంకుల యజమానులు కూడా కొలతలలో మోసాలకు పాల్పడకుండా ఉంటారని తెలిపారు. నెలలో మూడు, నాలుగు జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ప్రజల్లో కూడా చైతన్యం రాలలసిన అవసరం ఉందని, అప్పుడే ఇలాంటి వాటిని అరికట్టడానికి అవకాశం ఉందన్నారు. వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని, నీతి నిజాయితీగా పనిచేసే పెట్రోల్ పంపులకు ఆదరణ ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. పెట్రోల్ పంపుల ఆకస్మిక తనిఖీల్లో మంత్రి వెంట సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ సంచాలకులు జి.రవికుమార్, సిఎస్‌వో నాగేశ్వరరావు, తూనికలు, కొలతల శాఖల అధికారులు, తదితరులు ఉన్నారు.
నగదు రహిత విధానం తప్పనిసరి కాదు
చౌక ధరల దుకాణాలల్లో నగదు రహిత విధానం తప్పనిసరికాదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఇటీవల బదిలీపై వెళ్లిన కలెక్టర్ బాబు.ఎ నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలంటూ డీలర్లపై ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో మంత్రి ఈ ప్రకటన చేయటం గమనార్హం. మంగళవారం విజయవాడ నగరంలో రేషన్ షాపులో మంత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్‌షాపు వద్ద పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ నగదు రహిత విధానం వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. దీనిపై మంత్రి స్పందించి నగదు రహిత చెల్లింపులు ద్వారా మాత్రమే నిత్యావసర సరుకులు పంపిణీ చేయమని ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందించిన అధికారులను గుర్తించి, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లయిస్ డైరక్టర్ జి రవిబాబును ఆదేశించారు. కార్డుదారులు నగదుతోనైనా, నగదు రహితంగానైనా సరుకులు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. నగదు రహిత విధానం తప్పనిసరి కాదని స్పష్టం చేశారు.

దోమలపై హైటెక్ యుద్ధం!
ప్రయోగాత్మకంగా విజయవాడలో అమలు పదేశంలోనే తొలిసారి ఈ తరహా ప్రయోగం

విజయవాడ, మే 9: దోమలపై హైటెక్ యద్ధానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధవౌతోంది. ‘స్మార్ట్ మస్కిటో డెన్సిటీ సిస్టమ్’ను విజయవాడ నగర పరిధిలో అమలు చేసేందుకు వీలుగా నిధులు మంజూరు చేసింది. దేశంలోనే ఈ తరహా తొలి ప్రయోగానికి రాష్ట్రం వేదిక కానుంది. రాష్ట్రంలో వివిధ పట్టణాలు, నగరాల్లో దోమల బెడద ఎక్కువగా ఉండటంతో ఆయా స్థానిక సంస్థలు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ అంతగా ఫలితం ఉండటం లేదు. దోమల ద్వారా వ్యాధుల బారినపడి పలువురు ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు అనేకం నమోదవుతున్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం దోమలపై దండయాత్ర చేపట్టింది. అది ఎక్కువగా ప్రచారానికే ఉపయోగపడిందనే విమర్శలను మూటగట్టుకుంది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో దోమల బెడదను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈ ఏడాది మార్చిలో రాష్ట్రం ఒక ప్రతిపాదన పంపింది. అత్యాధునిక సెన్సర్లు ఉపయోగించి దోమల జాడను గుర్తించే ‘స్మార్ట్ మస్కిటో డెన్సిటీ సిస్టం’గా దీన్ని వ్యవహరిస్తారు. ఆధునిక సెన్సర్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తిస్తారు. మలేరియా, చికున్‌గున్యా, డెంగ్యూ, జికా వంటి వ్యాధులు ప్రమాదకర స్థాయికి చేరేలోగా నియంత్రణకు చర్యలు తీసుకుంటారు. దోమల ఉత్పత్తి ప్రాంతాలతో పాటు దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, ఆడదోమలా? మగదోమలా? అనేది, దోమ జాతినీ గుర్తిస్తారు. ఈ వివరాలను సేకరించేందుకు వీలుగా సమీపంలోని విద్యుత్ స్తంభాలకు ఆప్టికల్ సెన్సర్లు అమరుస్తారు. ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో 10 సెన్సర్లు అమరుస్తారు. మూడు నగరాల్లో 1850 సెన్సర్లు అమర్చాలని తొలుత ప్రతిపాదించారు. తొలిదశకు 4 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేశారు.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వినియోగించి, సెన్సర్ల ద్వారా సేకరించిన సమాచారం వైద్య, ఆరోగ్య శాఖకు చేరుతుంది. దీనివల్ల దోమల ఉత్పత్తి కేంద్రాలు, దోమల జాడను కచ్చితంగా తెలుసుకునే వీలుంటుంది. దీంతో దోమల నియంత్రణకు సరైన చర్యలు తీసుకోవడంతో పాటు అనవసర వ్యయాన్ని నియంత్రించే వీలుంటుంది. రాష్ట్రంలో మూడు నగరాల్లో అమలుకు ప్రతిపాదించినప్పటికీ, తొలుత ప్రయోగాత్మకంగా విజయవాడలో అమలు చేయాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాల్లో కూడా దోమల బెడదపై ఆసక్తికరమైన చర్చ జరిగిన విషయం తెలిసిందే. పలువులు ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో విజయవాడలో అమలు చేసేందుకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ 1.55 కోట్ల రూపాయల మంజూరుకు పాలనాపరమైన ఆమోదం తెలుపుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలో విజయవాడలో దోమలపై హైటెక్ యుద్ధం ప్రారంభం కానుంది.