ఆంధ్రప్రదేశ్‌

సాంకేతికత సాయంతో సమర్థ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 9: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అమెరికాలో అరుదైన గౌరవం, గుర్తింపు లభించాయి. భారత్-యూఎస్ భాగస్వామ్యానికి రాష్ట్ర స్థాయిలో కృషి చేస్తున్నందుకు గాను 2017 సంవత్సరానికి యునైటెడ్ స్టేట్స్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఎస్‌ఐబిసి) చంద్రబాబుకు ‘ట్రాన్స్‌ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్’ పురస్కారం ప్రకటించింది. కాలిఫోర్నియాలో యుఎస్‌ఐబిసి రెండవ వార్షిక పశ్చిమ తీర సదస్సు వేదికపై ఈ అవార్డును సిస్కో సంస్థ వరల్డ్‌వైడ్ హెడ్ జాన్ చాంబర్స్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి అందుకున్నారు. ఈ పురస్కారం తనకు మాత్రమే కాదని, తన రాష్ట్రానికి దక్కిన గౌరవంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇది అమెరికన్ ఇనె్వస్టర్ల నుంచి తన రాష్ట్రానికి ఇస్తున్న మద్దతుగా భావిస్తున్నానని అన్నారు. ఇక్కడున్న ప్రతి యూఎస్ పారిశ్రామికవేత్త ఏపీకి వచ్చి ఒక పరిశ్రమను స్థాపించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు. అనేక సంవత్సరాలుగా భారత్-యుఎస్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. యుఎస్‌ఐబిసి సదస్సులో కీలకోపన్యాసం చేసిన ముఖ్యమంత్రి ‘సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌ఫర్మేషనల్ జర్నీ టువర్డ్స్ ఏ హ్యాపీ స్టేట్’ అంశంపై ప్రధానంగా మాట్లాడారు.
సాంకేతికతను సమర్థంగా ఉపయోగించుకుని ప్రయాణం సాగిస్తున్నామని చంద్రబాబు తన ప్రసంగంలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సరికొత్తగా ఏర్పడిన రాష్టమ్రని, ఆరంభంలో కొన్ని కష్టాలు ఉన్నాయని, అలాగే అనేక అనుకూలతలు ఉన్నాయని చెప్పారు. సుదీర్ఘ తీర ప్రాంతం, అపారమైన సహజ వనరులు, నైపుణ్యం గల మానవ వనరులు ఏపీకి సొంతమన్నారు. గత మూడేళ్లుగా రెండంకెల వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్నామన్న ముఖ్యమంత్రి 20 ఏళ్ల పాటు 15 నుంచి 20 శాతం వృద్ధి రేటు సుస్థిరంగా ఉంటే తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోగలుతుతామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
వౌలిక సదుపాయాల కల్పనలో వేగంగా పనిచేస్తున్నామన్న ముఖ్యమంత్రి పోర్టులు, ఎయిర్‌పోర్టుల్లో పురోగతి కనిపిస్తోందని, ఇప్పటికే ఆరు పోర్టుల్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్పారు. మరో ఎనిమిది పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని, ఇక ఏపీకి తిరుగు ఉండదని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆరు విమానాశ్రయాలకు అదనంగా మరో ఆరు విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, రెండు కోస్టల్ ఎకనామిక్ జోన్లు రాష్ట్రానికి రానున్నాయని చెప్పారు.
మూడేళ్ల క్రితం 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటుతో మొదలైన ఏపీ ప్రయాణం మూడు నెలల వ్యవధిలోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చామని ముఖ్యమంత్రి చెప్పారు. త్వరలో 4,600 మెగావాట్ల సౌర పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామని, సౌర విద్యుత్ యూనిట్ రూ.2కే అందించగలిగితే భారత్‌కు తిరుగుండదన్నారు. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ నాలెడ్జ్ హబ్‌గా మారుతోందని చెప్పారు.