ఆంధ్రప్రదేశ్‌

ఢిల్లీ పర్యటనలో బాబు భద్రతపై నిఘా వర్గాల హెచ్చరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 10: ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. బాబు భద్రతకు సంబంధించి నిఘా వర్గాలు ఢిల్లీలోని ఏపి భవన్ రెసిడెంట్ కమిషనర్‌కు తాజా హెచ్చరికలు జారీ చేశాయి. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడి పోలీసుల ఆదేశాలు పక్కన పెట్టి స్వంతంగా సూచించిన మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారని, దీనివల్ల ఆయన ప్రాణానికి ముప్పు ఏర్పడితే తమకు సంబంధం లేదంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో అడుగుపెట్టగానే చంద్రబాబు రోడ్డు మార్గంలో కారులో కొంతదూరం, ఆతర్వాత మెట్రో రైలులో మరికొంత దూరం ప్రయాణించడం పట్ల గతంలోనే భద్రతా బలగాలు అభ్యంతరం తెలిపాయి. దీనికి తోడు ఏపి భవన్ వద్ద కూడా మావోయిస్టులు ఇదివరికే ఒకసారి రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈమేరకు అప్పట్లోనే కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలను ఢిల్లీ పోలీసు అధికారులు అప్రమ్తతం చేశారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై రాష్ట్ర నిఘా విభాగం ఇప్పుడు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం ఢిల్లీ పర్యటనలో ఇకపై మెట్రోరైలు ప్రయాణం మంచిది కాదని హెచ్చరించింది. మెట్రోరైలులో చంద్రబాబుకు భద్రత కల్పించడం కష్టమని పేర్కొంది. జెడ్‌ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబుకు మెట్రోరైలు ప్రయాణం ప్రమాదకరమన్న నిఘా విభాగం ఈ విషయమై ఏపి భవన్ అధికారులను అప్రమత్తం చేసింది. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కొన్ని సందర్భాల్లో ఢిల్లీ విమానాశ్రయం నుంచి మెట్రోరైలు ప్రయాణానికి చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. గతంలో ఓసారి ఏపి భవన్ వద్ద మావోయిస్టులు రెక్కీ నిర్వహించిన విషయాన్ని మళ్లీ ఇప్పుడు నిఘా వర్గాలు గుర్తు చేస్తున్నాయి.