ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలంలో బయటబడ్డ గుప్తనిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, మే 10 : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో బుధవారం గుప్తనిధి బయటపడింది. అందులో బంగారు కడియాలు, వెండి పాత్రలు లభ్యమయ్యాయి. వివరాలు.. శ్రీశైలం మహాక్షేత్రంలోని పంచమఠాల పునర్నిర్మాణంలో భాగంగా ఆలయం ప్రధాన వెనుక భాగంలోని గంటా మఠంలో దేవస్థానం అధికారులు గత కొద్దిరోజుల నుంచి జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. అందులో భాగంగా మఠాలను కొంత లోతు వరకూ తవ్వాల్సి వచ్చింది. దీంతో దేవస్థానం అధికారులు కొందరిని పర్యవేక్షకులుగా నియమించి తవ్వకాలు చేపట్టింది. ఈ క్రమంలో బుధవారం తవ్వకాలు జరుపుతుండగా అర కిలోకి పైగా ఉన్న బంగారు కడియాలు, 18 బంగారు నాణెములు, 147 వెండి నాణెములు, ఒక వెండి గినె్న, ఒక కుంకుమ భరిణి, 50 పంచలోహ నాణెములు బయటపడ్డాయి. దీంతో ఇంకా ఏమైనా పూరాతన నాణెములు, వస్తువులు బయటపడవచ్చన్న అభిప్రాయంతో దేవస్థానం అధికారులు ప్రత్యేక పర్యవేక్షణను ఏర్పాటు చేశారు. బయటపడ్డ ఈ వస్తువుల వివరాలను స్థానిక తహశీల్దార్ విజయుడుకి తెలయపరిచారు. అలాగే దేవస్థానం ఏసి మహేశ్వర్‌రెడ్డి పోలీసుల సమక్షంలో నాణెములకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.