ఆంధ్రప్రదేశ్‌

సమాజసేవలో ముందుండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 11: సమాజ సేవలో ముందుండేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చికాగోలోని తెలుగు సంఘాల సభ్యులకు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా చికాగోలో భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి ఏర్పాటైన సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడేలాగా కార్యక్రమాలు రూపొందించుకోవాలన్నారు. డబ్బు సంపాదించడమే కాకుండా కొంత సమాజానికి కేటాయించాలని, సమయాన్ని కూడా వెచ్చించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌తో తమ అనుసంధానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జన్మభూమిని మర్చిపోవద్దని ఏ విధంగా రాష్ట్రానికి సాయం చేయాలో ఆ విధంగా సహకరించాలని పిలుపునిచ్చారు. అమెరికా తదితర దేశాల్లో రానున్న 20 సంవత్సరాల్లో, 5 సంవత్సరాల్లో, సంవత్సర కాలంలో చోటుచేసుకునే మార్పులు, లభించే అవకాశాలపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఈ దిశగా తాము ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీని విస్మరించొద్దని కోరారు. అమెరికా దిగువ సభ సభ్యుడు డ్యానియల్ డేవిస్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు యుఎస్ కాంగ్రెసనల్ లైట్ ఆఫ్ ది లైఫ్ అవార్డు-2017ను అందజేశారు. అంతకుముందు రోచెష్టర్‌లో మాయో క్లినిక్ వైద్యులతో సమావేశమయ్యారు.

చిత్రం.. చంద్రబాబుకు అవార్డు అందజేస్తున్న అమెరికా దిగువసభ సభ్యుడు డేనియల్ డేవిస్