ఆంధ్రప్రదేశ్‌

బలహీన వర్గాలకు భరోసా ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మే 11: కాంగ్రెస్ హయాంలో దేశం అభివృద్ధి పథంలో ఉండగా, బిజెపి, టిడిపి ఆ పరిస్థితిని చిన్నాభిన్నం చేశాయని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. గురువారం ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ దేశంలో బలహీనవర్గాలకు భరోసా లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ అమలు చేసిన పథకాలను రద్దు చేయడం, పేర్లు మార్చడంతో ప్రజలు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాము అన్ని రకాల పోరాటాలు చేపట్టామన్నారు. కోటి సంతకాల సేకరణ ఉద్యమం, అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేశామన్నారు. దాంతోపాటు 14 పార్టీల మద్దతు కూడగట్టి, లోక్‌సభలో రెండుసార్లు వాకౌట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై ప్రజలను మోసగించారంటూ టిడిపి నేత చంద్రబాబునాయుడు, ప్రధాని మోదీలపై సెక్షన్ 420 కింద రాష్ట్రంలోని 800 పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టామన్నారు. గతంలో దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కట్టబెట్టినపుడు కేవలం కేబినెట్ తీర్మాణంతోనే ఆ హోదాను ఇచ్చారని గుర్తు చేశారు. అలాంటపుడు విభజన చట్టంలో పేర్కొన్న దానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి అభ్యంతరమెందుకని ఆయన ప్రశ్నించారు. పార్టీ సంస్థాగత ఎన్నికల గురించి మాట్లాడుతూ టిడిపి, బిజెపిలు ప్రజలను బ్లాక్‌మెయిల్ చేసి సభ్యత్వ నమోదు చేయిస్తున్నారని ఆరోపించారు. తాము ప్రతి బూత్ నుంచి కనీసం 50 మందిని సభ్యులుగా చేర్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం తమదేనని, రాహుల్‌ను ప్రధాని చేయాలన్నదే తమ ధ్యేయమన్నారు. ఈ సమావేశంలో పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణం రాజు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు యడ్ల ఆదిరాజు, బెహరా భాస్కరరావు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్సీ పి.విశ్వప్రసాద్, కిల్లి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.