ఆంధ్రప్రదేశ్‌

కరవు పరిస్థితి అంచనాకు సాంకేతిక కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 12: రాష్ట్రంలో కరవు పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు వీలుగా వివిధ సంస్థలతో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు శుక్రవారం జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే 301 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన డ్రౌట్ మానిటరింగ్ సెల్ కరవు పరిస్థితులను గమనిస్తోంది. కరవు పీడిత ప్రాంతాల్లో వాతారణ పరిస్థితులను అంచనా వేసేందుకు, స్వల్ప, దీర్ఘకాలిక కరవు పరిస్థితులను అంచనా వేసే వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు వీలుగా ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భారత వాతావరణ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, సతీష్‌థావన్ స్పేస్ సెంటర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీట్రియాలజీ, ఎపి స్పేస్ అప్లికేషన్ సెంటర్, రాష్ట్ర భూగర్భ జల డైరెక్టర్, సెంట్రల్ వాటర్ కమిషన్, ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ వర్సిటీ, ఎపి జలవనరుల విభాగం, సెంట్రల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ డైరెక్టర్, ఎపి స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీల ప్రతినిధులతో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే అమలు జరుగుతున్న కరవు నివారణ చర్యలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. వివిధ జాతీయ, అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అందచేసిన వాతావరణ వివరాలను మండల, జిల్లా స్థాయికి స్వల్ప, దీర్ఘకాలిక వాతావరణ అంచానాలను పంపే ఏర్పాట్లను చేస్తుంది. ఉపగ్రహ చిత్రాలు, భూగర్భ జలాలు, ఉపరితల నీటి పరిమాణం, తదితర అంశాలను క్రోడీకరించి కరవు అంచనా వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఈ కమిటీ కీలకం కానుంది. వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి వారానికోసారి శాస్ర్తియ సలహాలను ఇస్తుంది. కరవు తీవ్రతను తెలియచెప్పడం, కరవు నివారణ చర్యలపై పరిశోధన వంటివి ఈ కమిటీ చేపట్టనుందని రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్ శేషగిరిబాబు తెలిపారు.