ఆంధ్రప్రదేశ్‌

వ్యాపార లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 12: త్వరలో అమల్లోకి రానున్న జిఎస్‌టి చట్టానికి అనుగుణంగా డీలర్లు తమ వ్యాపార లావాదేవీలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని విజయవాడ వాణిజ్య పన్నులశాఖ డిప్యూటీ కమిషనర్ వి రఘునాథ్ స్పష్టం చేశారు. జిఎస్‌టి చట్టం ద్వారా పన్నుల వ్యవస్థలో భారీ మార్పులు వస్తాయని ఈ మార్పుల వల్ల వర్తక వాణిజ్య వర్గాలు, వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన వెల్లడించారు. జూలై 1 నుంచి జిఎస్‌టి చట్టం అమలుకానున్న నేపథ్యంలో శుక్రవారం విజయవాడలోని ఓ కల్యాణ మండపంలో ఎనిమిది సర్కిళ్ల వర్తక వాణిజ్య ప్రతినిధులకు అవగాహన, శిక్షణ తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ జిఎస్‌టిలో జరిమానాలు తక్కువ ఉంటాయన్నారు. వన్‌టైమ్ పెనాల్టీ మాత్రమే ఉంటుందని, దేశంలో సరుకులు ఎక్కడ కొనుగోలు జరిపినా ఇన్‌పుట్ ట్యాక్స్ పొందవచ్చునని ఆయన స్పష్టం చేశారు. జిఎస్‌టిలో పక్కాగా బిల్లులు ఇవ్వవలసి ఉంటుందని తెలియజేశారు, అధికారుల జోక్యం తగ్గుతుందని దీంతో అవినీతికి ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. ఇకపై పరోక్ష పన్నులన్నింటినీ కలిపి ఒకే పన్ను విధిస్తారని చెప్పారు. జిఎస్‌టి విధానంలో ఎలాంటి చెక్‌పోస్టులు ఉండవని ఆయన వెల్లడించారు. దీనివల్ల వ్యాపారస్థులకు సరుకు రవాణా వేగవంతంతో జరుగుతుందన్నారు. తద్వారా వ్యాపారాల వృద్ధి ఉంటుందని తెలియజేశారు. డీలర్లందరూ తప్పనిసరిగా జిఎస్‌టి విధానంలో మైగ్రేట్ కావలసిందేనని ఆయన స్పష్టం చేశారు.
జిఎస్‌టి చట్టంలో రిజిస్ట్రేషన్, టాక్స్ రిటర్న్‌లు, ఇన్‌పుట్ ట్యాక్స్ సబ్సిడీ, డిమాండ్ అండ్ టాక్స్ పేమెంట్ అంశాలపై తమ అధికారులు నిరంతరం సహకరిస్తారని రఘునాథ్ స్పష్టం చేశారు. జిఎస్‌టి చట్టంపై ఇప్పటికే తమ శాఖ అధికారులకు, సిబ్బందికి వివిధ దశల్లో శిక్షణ ఇచ్చామని స్పష్టం చేశారు. ది ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ మాట్లాడుతూ జిఎస్‌టి చట్టంలో వ్యాపారులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని అందరూ ఈ చట్టంపై అవగాహన పెంచుకోవాలన్నారు. అధికారులకు సహకరించాలని తద్వారా ఈ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేసారు. మరొక ప్రధాన ప్రతినిధి విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ రాబోయే చట్టంపై అధికారులు, సిబ్బందికి మాత్రమే కాక చట్టంలో మిళితమైన వర్తక వాణిజ్య వర్గాలకు కూడా అవగాహన కల్పించడం హర్షణీయమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సదస్సులో స్టెయిన్‌లెస్ స్టీల్, మేన్‌ఫ్యాక్చరింగ్ అసోసియేషన్ , ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్, ఎలక్ట్రానిక్ డీలర్స్, హోటల్ డీలర్స్ కృష్ణాజిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్స్, ఫర్నీచర్ డీలర్స్, ఫుట్‌వేర్ డీలర్స్, టింబర్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, వాణిజ్య పన్నులశాఖ అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..జిఎస్‌టి అవగాహన సదస్సులో మాట్లాడుతున్న వాణిజ్యపన్నుల శాఖ ఉప కమిషనర్ రఘునాథ్