ఆంధ్రప్రదేశ్‌

ప్రధాని వ్యక్తిత్వం దిగజార్చేలా కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, మే 13: అవినీతి రహిత పాలన అందిస్తున్న ప్రధాని మోదీని చులకన చేసే విధంగా మిత్రపక్ష నాయకులు చేస్తున్న భాషను తీవ్రంగా ఖండిస్తున్నానని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపి నేత జగన్ ప్రధాని మోదీని కలవడంపై మిత్రపక్ష నాయకులు మాట్లాడిన తీరును ఆయన తప్పుబట్టారు. కేసులు బలహీనపర్చడం కోసం ప్రధానిని కలిశారని విపరీత అర్థాలతో మాట్లాడటం సరికాదన్నారు. ప్రతిపక్ష నేతకు అపాయింట్‌మెంటు ఇవ్వడం సర్వసాధారణమన్నారు. ప్రజాస్వామ్య దేశం లో సిబిఐ, కోర్టు కేసులు ప్రధాని మార్చే అవకాశం ఉందా ? అని ప్రశ్నించారు. ప్రజలకు తప్పుడు అభిప్రాయాలను టిడిపి నేతలు పంపుతున్నారన్నారు. ప్రపంచం ప్రధాని నరేంద్రమోడీ వ్యక్తిత్వం, పనితీరును శ్లాఘిస్తున్న స్థితిలో రాష్ట్రంలో బూచిని చూపించి ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా కుట్ర జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో బాధ్యత గల వ్యక్తులు మాట్లాడేటప్పుడు ఆచీ తూచి మాట్లాడాలని, అన్యోపదేశంగా మాట్లాడితే ఆ మాటలను వెనక్కి తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఈ నెల 25న విజయవాడలో బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌షా సభ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు జరుగుతుందన్నారు. రాష్ట్రం లో పోలింగ్ బూత్ కమిటీల నుంచి ముగ్గురిని ఈ సమావేశానికి ఆహ్వానిస్తారన్నారు.