ఆంధ్రప్రదేశ్‌

ఎసిబి వలలో విజయనగరం వన్‌టౌన్ సిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మే 14: పట్టణంలోని వన్‌టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న పి.శోభన్‌బాబు రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కాడు. ఆదివారం మధ్యాహ్నాం 2 గంటల సమయంలో వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి ఈ మొత్తం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. దీనికి సంబంధించి సెంట్రల్ యూనిట్ ఎసిబి డిఎస్పీ ఎస్‌వివి ప్రసాదరావు వెల్లడించిన వివరాలివి. ఇటీవల కిడ్నాప్‌నకు పాల్పడిన హోంగార్డుల కేసులో నిందితులను అరెస్టు చేయడానికి, ప్రాపర్టీ రికవరీ చేయమని రియల్ ఎస్టేట్ వ్యాపారి యర్రా ఈశ్వరరావు సిఐని ఆశ్రయించగా, అందుకు రూ.5 లక్షలు ఇమ్మని సిఐ శోభన్‌బాబు డిమాండ్ చేశారు. అయితే ఈశ్వరరావు రూ.3 లక్షలు ఇవ్వడానికి అంగీకరించాడు. పోలీసు స్టేషన్‌లో సిఐ శోభన్‌బాబు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ దాడిలో సిఐ సతీష్, విశాఖ జిల్లా ఎసిబి ఇన్‌స్పెక్టర్లు గణేష్, రమేష్, రమణమూర్తి, విజయనగరం జిల్లా ఇన్‌స్పెక్టర్లు లక్ష్మోజీ, రమేష్‌లు పాల్గొన్నారు.