ఆంధ్రప్రదేశ్‌

పారిశుద్ధ్య పనులు ప్రైవేటుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మే 14: పారిశుద్ధ్య నిర్వహణ ..ఇది నగరాలు..పట్టణాలకు అతి పెద్ద బాధ్యత. నిత్యం కమిషనర్లు తెల్లవారుజామున పారిశుద్ధ్య నిర్వహణపై తిరుగుతుంటారు. ఇందుకు కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు ఏటా వందల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తుంటాయి. అయినా సమస్య సమస్యగానే మిగిలిపోతోంది. దీంతో కమిషనర్లకు ఇది తలకు మించిన భారంగా పరిణమించింది. ఈ పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యత ఇక ప్రైవేటుకు అప్పగించాలని పుర పరిపాలనా విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించి జిఒ 279ని విడుదలచేసింది. ఇప్పటికే ఈ అంశంపై ఆయా కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానాలు చేశాయి. కొన్ని పురపాలక సంఘాలు టెండర్ల దశకు చేరగా, మరికొన్ని ఆ పనిలో నిమగ్నమైఉన్నాయి.
పారిశుద్ధ్య పనులను టెండర్ల ద్వారా దక్కించుకున్న వారు పురపాలక సంఘం అధికారుల పర్యవేక్షణలో పనులు నిర్వహిస్తారు. అయితే పారిశుద్ధ్య కార్మికుల వ్యవహారం పూర్తిగా కాంట్రాక్టర్లకే సంబంధం ఉంటుంది. వేతనాలు, పనులు చేయించడం తదితరాలు కాంట్రాక్టర్లే చూసుకుంటారు. పనులు బాగా జరుగుతున్నాయా.. లేదా అనే విషయాన్ని నెల చివరిలో శానిటరీ ఇన్‌స్పెక్టర్, కార్పొరేషన్, మున్సిపల్ కమీషనర్ ధ్రువీకరిస్తారు. ఏ మాత్రం పనులు సక్రమంగా చేయకపోయినా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన సర్వీసు చార్జీల్లో కోత విధిస్తారు.
ప్రతీ వీధికి ఒక పుష్‌కార్టు ఇచ్చి, ఇద్దరు కార్మికుల చొప్పున నియమిస్తారు. వీరు ఉదయం పూట ఇంటింటికి తిరగి చెత్త సేకరణ చేస్తారు. ఈ చెత్తను వారి దగ్గరలో ఉన్న కలెక్షన్ పాయింట్ వద్దకు తీసుకువెళతారు. అక్కడ ఏర్పాటుచేసిన మూడు పెద్ద బండ్లలో చెత్తను తీసుకుని డంపింగ్ యార్డులకు తరలిస్తారు. అదేవిధంగా సాయంత్రం వేళల్లో మురుగుకాలువలు తీయడం తీసిన చెత్తను ఎత్తివేయడం వంటి పనులు చేయాలి. దీంతో పాటు గ్యాంగ్ వర్క్‌కింద పది మందిని నియమించి పెద్ద పెద్ద పారిశుద్ధ్య పనులు వార్డుల వారీగా తిరిగి పనిచేస్తారు.
పారిశుద్ధ్య శాశ్వత కార్మికులకు పురపాలక సంఘం అధికారులు అధీనంలోనే ఉంచుకుని, వీరిని క్లస్టర్లుగా నియమిస్తారు. మిగిలిన వారు కాంట్రాక్టు కార్మికులుగా కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తారు.