ఆంధ్రప్రదేశ్‌

మిర్చి రైతు బలవన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచర్ల, మే 14: అప్పులపాలైన ఓ మిర్చిరైతు కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం దావుపల్లి గ్రామానికి చెందిన రమావత్ లాలునాయక్(46) ఈ ఏడాది 5 ఎకరాల్లో మిర్చి సాగుచేశాడు. 2 ఎకరాలు సొంత పొలం కాగా, 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. దిగుబడి బాగానే ఉన్నప్పటికీ ఆశించిన మేరకు ధరలు లేకపోవటంతో 5 లక్షల రూపాయల మేర అప్పులపాలయ్యాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన లాలునాయక్ అప్పులు తీర్చలేననే భయంతో ఆదివారం జెర్రివాగు వద్దకు వెళ్లి కృష్ణానదిలో దూకాడు. ఇది గమనించిన మత్స్యకారులు లాలునాయక్ బయటకు తీసే ప్రయత్నం చేశారు. అప్పటికే అతను మృతి చెందాడు. మృతదేహాన్ని బయటకు తీసి విషయాన్ని అక్కడి చెంచులకు తెలియజేశారు. వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
మృతుడు లాలునాయక్‌కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డి, తదితరులు రైతు మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.