ఆంధ్రప్రదేశ్‌

భక్తుల సూచనలతో మరింత మెరుగైన సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 14: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు టిటిడి అందిస్తున్న సౌకర్యాలపై వారి సూచనలు, సలహాలు సేకరించి మరింత మెరుగైన సేవలందించనున్నట్లు టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఆదివారం తిరుమల ఇన్‌చార్జ్ జెఇఓ పోలా భాస్కర్‌తో కలిసి తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లను ఇఓ తనిఖీ చేశారు. అందులో భాగంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో ఉన్న ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శనశాలను సందర్శించారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని కంపార్ట్‌మెంట్లను తనిఖీ చేశారు. భక్తులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించారు. ముఖ్యంగా అధికారులు సమయానుకూలంగా అన్నప్రసాదాలు అందిస్తున్నారా అని ఇఓ భక్తులను అడిగి తెలుసుకున్నారు. వారు కూడా టిటిడి అందిస్తున్న అన్నప్రసాదాలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం టిటిడి ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ టి.రవిని భక్తులకు అందిస్తున్న వివిధ వసతులు, సదుపాయాలకు సంబంధించి అభిప్రాయ సేకరణ చేయాలని ఆయన ఆదేశించారు. భక్తులు తమ అభిప్రాయాలను తెలిపేందుకు వీలుగా దివ్యదర్శనంలో రెండు, సర్వదర్శనంలో రెండు కంపార్ట్‌మెంట్లలో సలహాలు, సూచనల పుస్తకాలు ఏర్పాటు యాలని సూచించారు. భక్తులకు అర్థమయ్యే రీతిలో అభిప్రాయ సేకరణ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఇఓ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కాగా తిరుమలలో గత మూడు రోజులుగా వారాంతపు సెలవుల వల్ల భక్తుల రద్దీ విశేష సంఖ్యలో పెరిగింది. దానికి అనుగుణంగా టిటిడి అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. నారాయణగిరి క్యూలైన్‌లలో భక్తులకు నిరంతరాయంగా శ్రీవారి సేవకులచే అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఇఓ ఆదేశించారు.