ఆంధ్రప్రదేశ్‌

వర్గీకరణకు చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 14: తక్షణం ఎస్సీ వర్గీకరణ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. వర్గీకరణ పోరాటంలో ఉద్యోగుల పోరాటం కీలకమన్నారు. మాదిగ ఉద్యోగుల జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించమని ప్రచారం చేసిన మాలలకు మూడు పదవులు కట్టబెట్టి, గెలిపించడానికి కృషిచేసిన మాదిగలకు చంద్రబాబునాయుడు మూడు నామాలు పెట్టారని ఆరోపించారు. ఎన్నికల ముందు మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు ఇప్పటికీ మాదిగలపై దృష్టిసారించలేదన్నారు. మాదిగల ఉనికిని కాలరాయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మార్పీఎస్ స్థాపించి 23 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూలై 7వ తేదీన అమరావతిలో లక్ష మందితో కురుక్షేత్ర మహాసభ నిర్వహించనున్నామని వెల్లడించారు. ఈ సభకు మాదిగల సమీకరణకు రెండు రాష్ట్రాల సన్నాహక సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
మాదిగ సామాజికవర్గానికి చెందిన రావెల కిషోర్‌బాబును మంత్రివర్గం నుంచి తొలగించి అదే సామాజికవర్గానికి చెందిన జవహర్‌కు ఆ శాఖను కేటాయించకుండా నక్కా ఆనంద్‌బాబుకు కేటాయించడం ద్వారా చంద్రబాబునాయుడు మాదిగలకు నమ్మకద్రోహం చేశారని కృష్ణమాదిగ ఆరోపించారు. చంద్రబాబునాయుడు మాలలను నెత్తికెక్కించుకున్నారని, అమరావతి మాదిగల వ్యతిరేక శక్తుల అడ్డాగా మారిందని ఆరోపించారు. ఎన్నికల ముందు షెడ్యూల్ కులాల వర్గీకరణలో పెద్ద మాదిగ అనిపించుకుంటానన్న చంద్రబాబునాయుడు ఆ తర్వాత దానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు ప్రాధాన్యత లేని శాఖలను కేటాయించారన్నారు. ఇప్పటికైనా సిఎం స్పందించి అఖిలపక్షాన్ని ఏర్పాటుచేసి, ఢిల్లీ వెళ్ళి ప్రధానిని కలిసి మాదిగలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. మాల, మాదిగ, రెల్లి సామాజికవర్గానికి చెందిన వారికి ఒక్కొక్క ప్రధాన శాఖ కేటాయించాలని, లేదంటే మాదిగల ఆగ్రహానికి గురి కావాల్సివుంటుందని హెచ్చరించారు. అమరావతిలో జరగనున్న కురుక్షేత్ర సంగ్రామాన్ని విజయవంతం చేసి మాదిగల ఉనికిని చాటడానికి శక్తివంచనలేకుండా పాటుపడాలన్నారు. ఈ సమావేశంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు కెకె ప్రసాద్‌బాబు, రాష్ట్ర అధ్యక్షుడు చిలుమూరి శ్రీనివాసరావు, తెలంగాణా అధ్యక్షుడు డాక్టర్ ఎం కృష్ణయ్య, జిల్లా అధ్యక్షుడు గోపాలబాబు తదితరులు పాల్గొన్నారు.