ఆంధ్రప్రదేశ్‌

తొలగించిన కార్మికులను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 14: రాజమహేంద్రవరం పేపర్‌మిల్లులో తొలగించిన 10 మంది కార్మికులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా, పరిశ్రమల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం జెకె గార్డెన్స్‌లో ఆదివారం గౌడ, శెట్టిబలిజ ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పితాని సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. పేపర్‌మిల్లులో ఉద్యోగాల నుంచి తొలగించిన పది మంది కార్మికుల కోసం పాత యాజమాన్యంతో ఇప్పటికే చర్చించామని, అయితే ఈలోగా యాజమాన్యం మారిందన్నారు. మే ఒకటో తేదీ నుంచి కొత్త యాజమాన్యం చేతికి వచ్చిన పేపర్‌మిల్లులో ఈ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు.
అంతకు ముందు జరిగిన గౌడ, శెట్టిబలిజ ప్రజా ప్రతినిధుల ఆత్మీయ అభినందన సభలో ముఖ్య అతిథిగా మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ కులాన్ని గుర్తించిన పార్టీకి అండగా ఉండాలని గౌడ, శెట్టిబలిజ సంఘీయులకు ఉద్బోధించారు. గౌడ, శెట్టిబలిజ అంటే ఒకటేననే స్ఫూర్తిగా ఈ సభను నిర్వహించిన ఆహ్వాన కమిటీని అభినందిస్తున్నామన్నారు. బలహీన వర్గాలకు ఒక పెద్దన్న పాత్ర పోషించి గౌడ, శెట్టిబలిజ సామాజికవర్గం స్ఫూర్తిదాయకంగా వ్యవహరించాలని సూచించారు. బీసీలంతా ఒకటేనని నిరూపించాలన్నారు. తాను మూలాలు మర్చిపోయి రాజకీయాలు చేసే వ్యక్తిని కాదన్నారు. సామాజిక విలువలతో పనిచేస్తున్నామని, సమస్యలను ప్రభుత్వం తరపున పరిష్కరిస్తామన్నారు. తమకు లభించిన గౌరవంతో సామాజికవర్గ గౌరవాన్ని కాపాడతామన్నారు. కులం మనోభవాలకు దిక్సూచిగా సిఎం వద్దకు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరించేందుకు వెనుకంజ వేయమన్నారు. బలమైన వ్యక్తులు గౌడ, శెట్టిబలిజ సామాజికవర్గంలో ఉన్నారు కాబట్టే వర్గ న్యాయాన్ని పొందామన్నారు. జనం వుంటేనే పార్టీలు గుర్తింపు ఇస్తాయని, కులంలో వున్న ఆవేదనను టిడిపి గుర్తించిందన్నారు. రానున్న ఎన్నికల్లో కులం అభిమానంతో పార్టీ విజయం సాధిస్తుందన్నారు. గుర్తింపు ఇచ్చిన పార్టీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మాల మాదిగల మధ్య ఒక శాతమే వ్యత్యాసం వుందని పేర్కొంటూ అన్ని కులాలకు న్యాయం జరుగుతుందన్నారు.
ఈ సభకు మరో ముఖ్య అతిథిగా శాసన మండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇటు పదవులు ఇచ్చిన పార్టీ బాధ్యతలు, అటు కులం ఇచ్చిన బలాన్ని సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు. పార్టీల్లో పదవుల కోసం పోటీతత్వం పెరగాలన్నారు. కులాభిమానం ఉండాలని, అయితే అది దురాభిమానం కాకూడదని, ఇతర కులాలను దూషించకూడదన్నారు. సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలకు గౌడ, శెట్టిబలిజలు ప్రాతినిధ్యం వహించాలన్నారు. రాజకీయ పార్టీలు పోటీతత్వంతో కుల గుర్తింపు ఇవ్వాలన్నారు. ప్రతీ నియోజకవర్గం, మండల కేంద్రాల్లో పూలే బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి కృషిచేయాలన్నారు. కోనసీమ కొత్తపేటలో రూ.3 కోట్ల నిధులతో బీసీ కమిషన్ పేరిట మహాత్మా పూలే భవన్ నిర్మిస్తున్నామన్నారు. ప్రతీ చోటా పూలే భవన్‌లు నిర్మించాలన్నారు. సమావేశంలో మంత్రి పితాని సత్యనారాయణ, శాసన మండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు ఆత్మీయ అభినందన అందుకున్నారు.