ఆంధ్రప్రదేశ్‌

మాజీ లెజిస్లేటర్ల సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: రాష్ట్రంలోని మాజీ లెజిస్లేటర్ల సమస్యలపై ప్రభుత్వం ఇంతకు ముందు అంగీకరించిన అంశాలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఏపి మాజీ లెజిస్లేటర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.సుబ్బరాజు, ఫోరం ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరాం.. సోమవారం శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఫోరం ప్రతినిధులు స్పీకర్‌తో ముచ్చటిస్తూ నూతన శాసనసభ ప్రాంగణంలో ఫోరానికి ఆఫీసు గదిని కేటాయించాలని, నెలనెలా మాజీ సభ్యులకు ఇచ్చే నెలసరి మందులను విజయవాడలో లేదా జిల్లా కేంద్రాల్లో సరఫరా చేయాలని కోరారు. అంగీకరించిన విధంగా కర్ణాటక రాష్ట్రంలో మాజీ సభ్యులకు అమలుచేస్తున్న సదుపాయాలను రాష్ట్రంలో కూడా వర్తింపచేయాలని కోరారు. ప్రభుత్వం అంగీకరించి జివో కూడా విడుదల చేసినప్పటికీ హైదరాబాద్‌లో మాజీ సభ్యుల ఇళ్ల స్థలాల అంశం న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నందున అమరావతిలో కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. జూన్ మాసంలో అమరావతిలో మాజీ లెజిస్లేటర్ల వార్షిక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సుబ్బరాజు, శివరాం ఈ సందర్భంగా స్పీకర్‌కు తెలియజేశారు.