ఆంధ్రప్రదేశ్‌

మహానాడు తీర్మానాలు సిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 15: విశాఖపట్నంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడులో చర్చించాల్సిన అంశాలపై సోమవారం ఇక్కడి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో తీర్మానాల కమిటీ సమావేశమైంది. ఎమ్మెల్సీ టిడి జనార్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 16 అంశాలను ఎంపిక చేశారు. మొదటగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు నివాళులర్పించే అంశాన్ని పార్టీ నేత పాటిబండ్ల అనిల్ ప్రతిపాదిస్తారు. పార్టీ ఆవిర్భావం - సామాజిక, రాజకీయ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులపై మంత్రి కాల్వ శ్రీనివాసులు, పార్టీ సభ్యత్వం - సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల సంక్షేమంపై వివివి చౌదరి, ఎంఏ షరీఫ్, జాతీయ రాజకీయాలు - తెలుగుదేశం పార్టీ పాత్రపై గురజాల మాల్యాద్రి, అంతర్జాతీయంగా తాజా పరిణామాలు - తెలుగువారిపై వాటి ప్రభావం అనే అంశాన్ని పరకాల ప్రభాకర్, పాటిబండ్ల అనిల్ ప్రవేశపెడతారు. ఈ అంశాలు రెండు తెలుగు రాష్ట్రాలకు వర్తిస్తాయి. కాగా ఏపికి సంబంధించి విభజన చట్టంలోని హామీలు - అమలును లంకా దినకర్, ప్రత్యేక ఆర్థిక సహాయం - హోదాకు మించిన నిధుల సాధన అంశాన్ని ఆర్థిక శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి కుటుంబరావు, మూడేళ్లలో 90శాతం మేనిఫెస్టో హామీల అమలు అంశాన్ని వై సాయిబాబు, దేశంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ - విజన్ 2029 డాక్యుమెంట్‌ను కుటుంబరావు, కృష్ణయ్య ప్రవేశపెడతారు. కరవు రహిత రాష్ట్రంగా ఏపి - నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అంశంపై ధూళిపాళ్ల నరేంద్రకుమార్, వ్యవసాయం - అనుబంధ రంగాల ప్రగతి గురించి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీర్మానాలు ప్రవేశపెడతారు. సిసిఐ భాగస్వామ్య సదస్సు, సీఫుడ్ ఫెస్టివల్‌పై పంచుమర్తి అనూరాధ, పేదరికంపై గెలుపు - ఎన్‌టిఆర్ భరోసా, గృహ నిర్మాణం, సమాజ, వ్యక్తిగత వికాసం అంశంపై వర్ల రామయ్య, జూపూడి ప్రభాకర్, సంక్షేమంపై జెఆర్ పుష్పరాజ్, నిమ్మల కిష్టప్ప, కింజరపు రామ్మోహన్ నాయుడు, శోభా హైమావతి, సంధ్యారాణి, చలమలశెట్టి రామానుజయ్య తీర్మానాలు ప్రవేశపెడతారు. అంతర్జాతీయ నగరంగా అమరావతిపై ఎన్ విజయ్‌కుమార్, వౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు స్వర్గ్ధామంగా ఏపి అంశాలను పి కృష్ణయ్య ప్రతిపాదిస్తారు.
మానవ వనరుల అభివృద్ధి - విద్య, వైద్య రంగాలపై చందు సాంబశివుడు, ముళ్లపూడి రేణుక, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి పయ్యావుల కేశవ్, ప్రగతి నిరోధక ప్రతిపక్షం - రాజకీయ కుట్రలు అనే అంశాన్ని గురజాల మాల్యాద్రి ప్రతిపాదిస్తారు. వీటిపై చర్చించిన అనంతరం తుది నిర్ణయాలను పార్టీ నేతలు ప్రకటిస్తారు.