ఆంధ్రప్రదేశ్‌

మోదీపై మాట్లాడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 15: బిజెపి-జగన్ కలిస్తే మాకే లాభమంటూ కొందరు ఎమ్మెల్సీలు చేసిన బహిరంగ ప్రకటనలు, ఒక క్రిమినల్, ఆర్థిక ఉగ్రవాదికి ప్రధానికి ఎలా అపాయింట్‌మెంట్ ఇస్తారంటూ నిలదీసిన వైనం ఇప్పుడు టిడిపి-బిజెపి బంధానికి విఘాతం కలిగేలా చేసింది. దీనిపై దిద్దుబాటుకు దిగిన టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చారు.విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మోదీపై మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు ఈ విషయంలో ప్రధాని గురించి మట్లాడాల్సిన అవసరం లేదు. నేను సీఎంగా ఉన్నా కాబట్టి చాలామంది నన్ను కలుస్తుంటారు. అలాగే ఆయన ప్రధాని కాబట్టి కలుస్తారు. దాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు. కాకపోతే జగన్‌ను ఎందుకు కలిశారని ప్రశ్నించండి తప్ప, మోదీ గురించి మాట్లాడవద్దు. రాష్టప్రతి ఎన్నిక విషయంలో జగన్ సెల్ఫ్‌గోల్ చేసుకున్నారు. దాన్ని మాట్లాడండి’ అని ఆదేశించారు. అంతకుముందు జగన్ విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశ అంశాలను మంత్రివర్గం దృష్టికి తీసుకువచ్చారు. దానిపై అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, సోమిరెడ్డి తదితరులు మాట్లాడారు. అయితే సమావేశంలో జగన్ అంశంపై అంతకుమించి పెద్దగా మాట్లాడలేదు. వర్షం, పిడుగులను ముందుగానే గుర్తించే వర్ష యాప్ విఫలంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ యాప్ ఏమైంది. అనంతపురంలో ఐదుగురు చనిపోయారు. కాబట్టి ఇకపై జాగ్రత్తగా ఉండండి అని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులను ఆదేశారు. పిడుగులు పడే 14 నిమిషాలకు ముందు ఎమ్మార్వోకు మీ మండలంలో పిడుగు పడుతుందన్న సమాచారం వచ్చిందని, అయితే ఎక్కడన్న సమాచారం ఇవ్వలేదని మంత్రి కాల్వ శ్రీనివాసులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. కొంతమంది మంత్రులు ఇంకా తమ శాఖలపై పట్టు సంపాదించలేదని, శాఖలపై మరింత అవగాహన పెంచుకుని స్వంత నిర్ణయాలు తీసుకునేలా ఉండాలని సూచించారు. ‘మనం ఏం చేసినా ప్రజల సంతృప్తి స్థాయికి పెంచేలా ఉండాల’న్నారు. వివిధ జిల్లాల్లో తాను హ్యాపీ ఇండెక్స్, తలసరి ఆదాయంపై చేయించిన సర్వే వివరాలు బాబు వెల్లడించారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం తక్కువగా ఉన్న జిల్లాల్లో శ్రీకాకుళం చివరి స్థానంలో ఉంటే, హ్యాపీ ఇండెక్స్‌లో ప్రధమ స్థానం, ప్రకాశం జిల్లా చివరి స్థానంలో ఉందని వివరించారు.
సంస్థాగత ఎన్నికలు వాయిదా: రాజప్ప
కాగా ఈనెల జరగాల్సిన టిడిపి జిల్లా పార్టీ ఎన్నికల తేదీలు మార్చారు. మే 19,20, 21,22న జిల్లా పార్టీ ఎన్నికలు, 23,24న మినీ మహానాడు నిర్వహించనున్నట్లు హోం మంత్రి చినరాజప్ప వెల్లడించారు.