ఆంధ్రప్రదేశ్‌

రైతు కోసం చర్చ జరగాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), మే 15: జిఎస్‌టి బిల్లు కోసం జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే రైతులకు అన్ని పంటల్లోనూ గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రాష్ట్రంలో ఉన్న పలు సమస్యలపై తప్పకుండా చర్చ జరగాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం ఏకగ్రీవంగా తీర్మానించింది. జిఎస్‌టి బిల్లు కోసం ఒక్కరోజు కాకుండా మిగతా సమస్యలపైనా చర్చించేందుకు కనీసం మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఎసిలో విజ్ఞప్తి చేయాలని తీర్మానించారు. సోమవారం నగరంలోని ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్‌లో ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శాశనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలతో పాటు పార్టీ ముఖ్యనేతలు హాజరై శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. జిఎస్‌టి బిల్లుకి పూర్తి మద్దతు ఇస్తూనే, ముఖ్యంగా రాష్ట్రంలో మిర్చి రైతుల వాస్తవ పరిస్థితిని సభ దృషికి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, రైతులకు గిట్టుబాటు ధరపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ ప్రయత్నించాలని నేతలు నిర్ణయించారు. అలాగే పలు సమస్యలను అసెంబ్లీలో చర్చించేందుకు గాను సభను ఒక్కరోజుకే పరిమితం చేయకుండా కనీసం మూడు రోజుల పాటు నిర్వహించేవిధంగా బిఎసిని ఒప్పించేందుకు ప్రయత్నించాలని నిర్ణయించారు.