ఆంధ్రప్రదేశ్‌

జిఎస్‌టిపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వెలగపూడి సచివాలయంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. జిఎస్‌టి వల్ల దేశానికి, రాష్ట్రానికి కలిగే లాభాల గురించి పార్లమెంట్ రీసెర్చి సర్వీస్ సభ్యులువివరించారు. ఇప్పటికే పార్లమెంట్‌లో అమోదముద్ర పొందిన ఎస్‌జిఎస్‌టి బిల్లును ఆసెంబ్లీలో అమోదించి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ నేతృత్వంలో ఈ అవగాహన సదస్సు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఒకే రకం పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్రం ఈ పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకురానుందని రీసెర్చి సర్వీస్ సభ్యులు వివరించారు. ఒక దేశం, ఒక పన్ను అన్న విధానం అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. దీని వల్ల కొంతకాలం రాష్ట్రానికి ఆదాయం తగ్గినప్పటికీ, దీర్ఘకాలంలో లాభం ఉంటుందని తెలిపారు. నిబంధనలకు లోబడి ఆ నష్టాన్ని భరించేందుకు కేంద్రం అమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. ఇప్పటి వరకూ ఉన్న పన్ను విధానం జిఎస్‌టి రాకతో పోతుందని తెలిపారు. ఏ వస్తువుకు ఎంత పన్ను విధిస్తారన్న దానిపై స్పష్టత లేదని కొంతమంది ఎమ్మెల్యేలు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులపై, కొన్ని విధానాలపై పన్ను మినహాయింపు ఉండాలన్నారు. జిఎస్‌టిపై మాట్లాడేందుకు తమకూ అవకాశం ఇవ్వాలని వైకాపా ఎమ్మెల్యేలు కొంతమంది అడిగారు.