ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రజ్యోతిని బహిష్కరిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: పాత్రికే విలువలకు తిలోదకాలిచ్చి ఫిబ్రవరి 17న ప్రధానికి రాసిన లేఖను మే 10న ఇచ్చినట్లు ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికపై పరువు నష్టం దావా వేస్తామని వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. అంతేకాకుండా ప్రెస్ కౌన్సిల్‌కు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం నాడిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానికి వైఎస్ జగన్ ఇచ్చిన వినతిపత్రంపై అసత్యాలు ప్రచారం చేస్తున్న ఆంధ్రజ్యోతి పత్రికను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఉమాశంకర్ గౌడ్, గాంధీ అనే అధికారులు టిడిపికి తొత్తులుగా మారారని వైఎస్ జగన్ ఫిబ్రవరి 17న ప్రధానికి లేక రాశారని, అయితే ఆ లేఖపై ఏప్రిల్ 13న కేంద్రం స్పందించి జవాబు ఇచ్చిందని తెలిపారు. ప్రధానికి జగన్ సమర్పించిన వినతిపత్రాన్ని అన్ని పత్రికలు ఇచ్చాయని, దానిలో అగ్రిగోల్డ్, ప్రత్యేక హోదా అంశాలను ప్రస్తావించారని తెలిపారు. కానీ ఆంధ్రజ్యోతి విలువలకు తిలోదకాలిచ్చి నాటి లేఖను ఇప్పటి లేఖగా పేర్కొంటూ ప్రచురించి జగన్‌పై బురద జల్లుతోందని ఆరోపించారు. తప్పుడు వార్త రాసిన ఆంధ్రజ్యోతిపై ప్రెస్‌కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు పరువు నష్టం దావా వేస్తామని ఆయన స్పష్టం చేశారు.

జగన్‌వన్నీ అబద్ధాలే: లోకేష్
ప్రధానితో భేటీ విషయంలో జగన్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారని మంత్రి లోకేష్ విమర్శించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో కొద్దిసేపు చిట్‌చాట్ చేశారు. జగన్ అసెంబ్లీని స్తంభింపచేస్తారంటున్నారు కదా అని ప్రశ్నించగా అసలు జగన్ ఏనాడు అసెంబ్లీని సక్రమంగా జరగనిచ్చారని అన్నారు. జగన్ ప్రధానితో లోపల మాట్లాడింది ఒకటి, బయటకు వచ్చి మాట్లాడింది మరొకటని విమర్శించారు. లోటు బడ్జెట్ ఉన్నా అభివృద్ధి చేస్తున్నందుకా? మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా మిర్చి, పసుపు రైతులను ఆదుకున్నందుకు అసెంబ్లీని అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. జగన్ అడ్డుపడాలని చూసినా రైతురుణమాఫీ, రాజధాని నిర్మాణం ఆగలేదన్నారు.