ఆంధ్రప్రదేశ్‌

చనిపోయినా పింఛన్లు మంజూరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 15: రాజమహేంద్రవరం నగరంలో పింఛన్ల బాగోతం బయటపడింది. వైసిపి, స్వతంత్ర అభ్యర్థి ప్రాతినిధ్యం వహించే వార్డుల్లో మృతిచెందిన లబ్ధిదారుల పేరిట పింఛన్లు దిగమింగారు. ఈ వ్యవహారం సోమవారం జరిగిన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో రగడ సృష్టించింది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశం మేయర్ పంతం రజనీ శేషసాయి అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో మృతి చెందిన వారి పేరిట పింఛన్ల సొమ్ము కాజేస్తున్నారని అధికార తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఆరోపించడంతో పెద్ద దుమారం చెలరేగింది. దీనితో 50 డివిజన్లు కలిగిన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో వైసిపి కార్పొరేటర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న 28వ డివిజన్, స్వతంత్ర అభ్యర్ధి ప్రాతినిధ్యం వహిస్తోన్న 29వ డివిజన్‌లోనూ మృతుల పేర్లతో పింఛన్లు కాజేశారని విచారణలో తేలిందని కమిషనర్ విజయరామరాజు ప్రకటించారు.
పింఛన్లు కాజేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని స్పష్టంచేశారు. కౌన్సిల్ సమావేశానికి ముందే పింఛన్ల బాగోతంపై ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపిన కమిషనర్ ఆ సమాచారాన్ని కౌన్సిల్‌లో వెల్లడించారు. ఎపుడో ఆరు నెలల క్రితమే లబ్ధిదారులు చనిపోయినట్టు తేలింది.
కానీ వారి పేరుతో మాత్రం పింఛన్ల సొమ్ము కాజేసినట్టు రుజువు కావడంతో అధికారులు క్రిమినల్ చర్యలకు ఉపక్రమించారు. ఎంతో కాలంగా ఈ వ్యవహారం సాగుతోందని, ఇప్పటికి అధికారులు ఆధారాలతో సహా విచారణ జరిపి నిగ్గు తేల్చారని అధికార పార్టీ కార్పొరేటర్లు పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో ఇటు వైసిపి, అటు అధికార పక్షం మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.