ఆంధ్రప్రదేశ్‌

ఐసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), మే 15: ఆంధ్రప్రదేశ్ ఐసెట్, ఈసెట్ ఫలితాలు-2017 సోమవారం విడుదలయ్యాయి. సెట్‌ల ఫలితాలను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలోని ప్రభుత్వ అతిథి గృహంలో విడుదల చేశారు. ఐసెట్‌లోశాఖపట్నానికి చెందిన ఎం మనోజ్ 189.9317 మార్కులతో టాపర్‌గా నిలిచాడు. ఐసెట్‌లో 86.56 శాతం ఉత్తీర్ణత నమోదయింది. ఐసెట్‌కు 70,678 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 62,962 మంది పరీక్షకు హజరయ్యారు. వీరిలో 54,503 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 86.56 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈసెట్‌లో 32,900 మంది విద్యార్థులు పరీక్షకు హజరుకాగా 30,877 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తంగా 93.85 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించగా వారిలో బాలురు 25146 మంది, బాలికలు 5731 మంది అర్హత సాధించారు. ఐసెట్ ర్యాంకు కార్డులను 20వతేదీ నుండి వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని, రెండు సెషన్లలో ప్రశ్నా పత్రాల్లో విద్యార్థుల నుండి 23 అభ్యంతరాలు వచ్చాయని నిపుణుల కమిటీ సలహా మేరకు 11 అభ్యంతరాలను సవరించినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
ఐసెట్‌లో ఎం మనోజ్ (విశాఖపట్నం), విఎన్ లక్ష్మీ ప్రసన్న (పశ్చిమగోదావరి), ఇమ్మిడిశెట్టి సౌజన్య (శ్రీకాకుళం), ఆర్ ఉదయ్ శ్రీనివాస్ (నెల్లూరు), జి భావన (విశాఖపట్నం), డి శ్రీవాత్సవ్ (శ్రీకాకుళం), ఐహెచ్ శశిధర్‌రెడ్డి (కర్నూలు), పి ఇంద్రతేజ (గుంటూరు), ఎ రాఘవేంద్ర (యదాద్రి భువనగిరి), ఎ హర్ష (అనంతపురం) మొదటి పది ర్యాంకులను దక్కించుకున్నారు.

చిత్రం..ఫలితాలు విడుదల చేస్తున్న మంత్రి గంటా