ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్యే ఉమాపై హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 15: క్యాన్సర్ వ్యాధితో చిన్నారి సాయిశ్రీ మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. సుమశ్రీ జీవించే హక్కును కాలరాసిన ఆమె తండ్రి, అధికార పార్టీకి చెంది న ఎమ్మెల్యే, మరికొందరిపై బాలల హక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. చిన్నారి మృతికి కారకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరుతూ ఈమేరకు విజయవాడ పోలీసు కమిషనర్‌ను ఆదేశించాలని పిటిషనర్ కోరాడు. విజయవాడ దుర్గాపురంలో నివాసముంటున్న చిన్నారి సాయిశ్రీ కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆదివారం మృతిచెందిన విషయం తెలిసిందే. తన బిడ్డ మరణానికి తండ్రి మాదంశెట్టి శివకుమార్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కారకులంటూ చిన్నారి తల్లి సుమశ్రీ ఆరోపిస్తోంది. పైగా చిన్నారి తనను బతికించాలని ఆర్థిక సాయం కోరుతూ ‘సెల్ఫీ’ ద్వారా తండ్రి శివకుమార్‌ను ప్రాధేయపడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. దీనిపై స్పందించిన హైదరాబాద్‌లోని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. కన్నకూతురు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బతికించాలని వేడుకున్నా తండ్రి చలించలేదని, ఆమె ఉంటున్న ఇల్లు అమ్మి వైద్యం చేయించుకునేందుకు కూడా సహకరించకపోగా మాదంశెట్టి శివ తన సోదరులు, ఎమ్మెల్యే బొండా ఉమా అండతో ఇంటిని కబ్జా చేయడం ద్వారా సకాలంలో వైద్యం అందక చిన్నారి చనిపోయిందని పిటిషనర్ పేర్కొన్నాడు. ఈ ఘటనపై విచారణ జరిపించి శివకుమార్, బొండా ఉమా, ఘటన వెనుక ఉన్న మరికొందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు పోలీసు కమిషనర్‌ను ఆదేశించాలని కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కమిషన్ జూలై 20 లోగా నివేదిక ఇవ్వాలని పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సాయిశ్రీ అంత్యక్రియలు సోమవారం విజయవాడలో జరిగాయి. ఘటనపై స్పందించిన అఖిలపక్ష నేతలు పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్‌ను కలిసి ఆమె మృతికి బాధ్యులపై ఫిర్యాదు చేశారు.