ఆంధ్రప్రదేశ్‌

వైద్య ఆరోగ్య శాఖలో ప్రారంభం కాని బదిలీల ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (జగదాంబ), మే 15: వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. సాధారణ బదిలీల్లో కొంత వెసులుబాటు కల్పించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు దరఖాస్తుల స్వీరకరణకు ఆది నుంచి అవాంతరాలు తప్పట్లేదు. ఈ నెల 5 నుంచి సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఈ నెల 25 నాటికి ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. పారదర్శకతతో బదిలీలు నిర్వహించాలన్న లక్ష్యంతో బదిలీలను ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిలో భాగంగా సాధారణ బదిలీల జిఓ 64ను అనుసరిస్తూ వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలకు కొన్ని మినహాయింపులు ఇచ్చి 318 జిఓ జారీ చేసింది. ఈ జిఓను మేరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మరికొన్ని నిబంధనలతో ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జిఓ మేరకు ఈ నెల 14 నాటికి బదిలీలకు సంబంధించి దరఖాస్తుల స్వీరకరణ పూర్తి కావాలి. అయితే ఇప్పటి వరకూ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన వెబ్‌సైట్ తెరచుకోలేదు. దీంతో అటు అధికారులు, ఇటు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. 13 జిల్లాలకు సంబంధించి ఉద్యోగులు ఆదివారం రాత్రి వరకూ ఎదురు చూసి వెబ్‌సైట్ తెరచుకోపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. వెబ్‌సైట్ తెరచుకుని ఉంటే 15,16 తేదీల్లో తమ దరఖాస్తులు పరిశీలనకు నోచుకునేవని, 17 నాటికి మెరిట్ జాబితాలు వచ్చేవని ఉద్యోగులు పేర్కొంటున్నారు. అయితే విజయవాడలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో చోటుచేసుకున్న సమన్వయ లోపంతో పాటు బదిలీల ప్రక్రియపై అవగాహన లేమి దీనికి కారణంగా ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సోమవారం సాయంత్రానికి కూడా ఇదే పరిస్థితులు నెలకొనడంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ప్రాంతీయ వైద్య ఆరోగ్య కేంద్రం వద్ద ఆందోళనకు సిద్ధపడుతున్నారు. ఈ నెల 24తో సాధారణ బదిలీలకు సంబంధించి గడువు ముగిసిపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే సాధారణ బదిలీల ఉత్తర్వులు, దానికి అనుగుణంగా వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మార్గదర్శకాలు ఎన్ని ఉన్నా అసలు బదిలీల ప్రక్రియే మొదలు కాకపోవడం ఆశాఖ పనితీరుకు అద్దం పడుతోందనడంలో సందేహం లేదు.