ఆంధ్రప్రదేశ్‌

ఎండలు బాబోయ్ ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు/నెల్లూరు,మే 15:ప్రచంఢభానుడి దాటికి ప్రజలు విలవిలలాడుతున్నారు. మూడురోజులపాటు జిల్లాలో ఎండలు మండుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసినట్లుగా తొలిరోజున ఎండల తీవ్రత భారీగా ఉంది. ప్రకాశం కందుకూరులో అత్యధికంగా మధ్యాహ్నం ఒంటిగంటకు 44.82 సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. జిల్లాకేంద్రమైన ఒంగోలులో 44.3, మార్కాపురంలో 45డిగ్రీలు సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఆదివారం 40.9సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్‌లు పెరగటంతో జిల్లాలోని ప్రజలు ఉక్కపోతతో విలవిల్లాడాయి. ఒక పక్క ఎండవేడిమి, మరో పక్క తాగునీటి ఎద్దడితో జిల్లా ప్రజలు అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రానున్న రెండురోజులపాటు 46నుండి 47సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రతల వరకు నమోదు అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేయటంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఉదయం 11గంటలనుండి సాయంత్రం నాలుగుగంటల వరకు జిల్లాకేంద్రమైన ఒంగోలుతోపాటు పలుప్రధాన పట్టణాల్లోని రోడ్లన్ని జనసంచారం లేక నిర్మూనుష్యంగా మారాయి. మధ్యాహ్నాం 12గంటలనుండి నాలుగుగంటల వరకు వెచ్చటి వేడిగాలులు వీయటంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం రెండుగంటలనుండి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్ళేందుకు ఉద్యోగులు భయపడాల్సిన పరిస్ధితి నెలకొంది. ఇదిలావుండగా నెల్లూరు జిల్లాలో కూడా ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న పగటిపూట ఉష్ణోగ్రతల ధాటికి జనం విలవిల్లాడిపోతున్నారు. వసంత రుతువులోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక గ్రీష్మరుతువులో పరిస్థితిని తలచుకునేందుకే ప్రజలు భయపడిపోతున్నారు. జిల్లాలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా అనూహ్య పెరుగుదల కనిపించింది. ముఖ్యంగా ఆది, సోమవారాల్లో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల సెంటిగ్రేడ్‌పైగా ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. కాగా చిత్తూరు జిల్లాలో ఉష్ణోగ్రత 43 డిగ్రీలను తాకింది. తిరుపతి, తిరుమలలో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది.

చిత్రం..ఒంగోలు రైల్వేస్టేషన్‌లో తాగునీరు పట్టుకుంటున్న రైలు ప్రయాణికులు