ఆంధ్రప్రదేశ్‌

20న మొబైల్ సైన్స్ ఎక్స్‌ప్రెస్ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మే 16: దేశంలో యువతకు శాస్త్ర, సాంకేతిక అంశాలపై ఆసక్తి కల్పించేందుకు ఉద్దేశించిన మొబైల్ సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 20న జిల్లాలోని కొత్తవలస చేరనుంది. 16 ఎసి కోచ్‌లతో ఉన్న ఈ రైలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించింది. 2007లో న్యూఢిల్లీలో ప్రారంభమైన ఈ రైలు ఏడో దశలో ఇక్కడకు చేరనుంది. 2007 నుంచి 2011 వరకు సైన్స్ ఎక్స్‌ప్రెస్ కింద ఈ రైలును నడిపారు. 2012లో దీనిని ‘బయోడైవర్శిటీ’ కింద మార్పు చేశారు. ఇప్పటి వరకు ఈ రైలు 1,41,800 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. 455 ప్రాంతాలలో హాల్ట్‌లు ఏర్పాటు చేసి 1602 రోజులు ప్రదర్శించారు. దాదాపు 1.56 కోట్ల మంది ఈ ప్రదర్శనను తిలకించారు. మరో నాలుగు రోజుల్లో ఈ రైలు కొత్తవలస చేరనుంది. ప్రస్తుతం ఈ ఎగ్జిబిషన్ రైలు పూరిలో ఉంది. ఈ నెల 17-19 వరకు ఛత్రపూర్‌లో పర్యటన అనంతరం 20న కొత్తవలస రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. 20-23 సాయంత్రం వరకు ఎగ్జిబిషన్ తిలకించేందుకు అందుబాటులో ఉంచుతారు. ఆ తరువాత 24-26 వరకు గుడివాడలోను, 27-30 వరకు తెలంగాణాలోని మిర్యాలగూడలో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు.