ఆంధ్రప్రదేశ్‌

జూన్ 9 నుండి 11 వరకు పున్నమి ఏరువాక ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: ఏరువాక ఉత్సవాలతో (వోర్వకల్ ఫెస్టివల్) రాష్ట్ర పర్యాటకంలో కొత్త పుంతలకు నాంది పలుకుతున్నామని మంత్రి అఖిలప్రియ తెలిపారు. ప్రజల దైనందిక జీవనశైలిలో కొంత ఆటవిడుపు కలిగేలాగా రాష్ట్రంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి పరచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంగళవారం పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు. దక్షిణ భారతదేశంలో రుతుపవనాలకు స్వాగతం పలుకుతూ రైతులు నిర్వహించే ఏరువాక ఉత్సవాలను పురస్కరించుకుని పున్నమి రోజుల్లో ఏరువాక పండగను ఘనంగా నిర్వహించదలచామన్నారు. ఇందుకోసం రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టామన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ తొలి రిజిస్ట్రేషన్‌గా పేరు నమోదు చేసుకున్నారు. సాంప్రదాయ ఉత్సవాల సమ్మేళనంతో ఆధునిక పోకడల నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. కేటగిరీల వారీగా రూపొందించిన ప్యాకేజీలకు అనుగుణంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ - హాట్ ఎయిర్ బెలూనింగ్, ఆకాశంలో డైవింగ్, రాక్ క్లెంబింగ్, రష్యన్ బాలేట్ నృత్య బృందం ప్రదర్శనలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, ప్రసిద్ధ కళాకారులచే ప్రత్యక్ష ప్రదర్శనలు ఉంటాయన్నారు.