ఆంధ్రప్రదేశ్‌

బెజవాడలో డాక్టర్ల దందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 16: విజయవాడలో కొందరు వైద్యులు తమకు డబ్బు బాకీ ఉన్న ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి నిర్బంధించి చితకబాదిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వైద్యులకు సహకరించిన ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడింది. నగరంలో పేరుమోసిన వైద్యులు కొందమంది ఓ సిండికేట్‌గా ఏర్పడి హవా సాగిస్తున్నారు. నగరంలోని టైమ్ ఆస్పత్రి, హెల్ప్ ఆస్పత్రుల్లో స్పెషలిస్టులుగా వ్యవహరిస్తున్న సదరు డాక్టర్లు పైకి వైద్యం చేస్తున్నా.. అంతర్గతంగా మరికొన్ని వ్యవహారాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా పటమటకు చెందిన తమ్మారెడ్డి బ్రహ్మాజీరావు (66) అనే వ్యక్తితో పరిచయం ఏర్పరచుకున్నారు. బ్రహ్మాజీరావు ప్రైవేటు లోన్లు కూడా ఇప్పిస్తుంటాడు. ఈ వైద్యుల బృందం కోరిక మేరకు తాతాజీ అనే వ్యక్తి వద్ద ఐదు కోట్లు రుణం ఇప్పిస్తానని చెప్పి కొద్దిరోజుల క్రితం డాక్టర్ల సిండికేట్ నుంచి కోటి రూపాయలు తీసుకున్నాడు. అయితే కోటి తీసుకున్న బ్రహ్మాజీరావు డబ్బు తిరిగి ఇవ్వకపోగా.. రుణం కూడా ఇప్పించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో ఈనెల 14వ తేదీ రాత్రి అతడిని కిడ్నాప్ చేసిన డాక్టర్లు విజయవాడ శివారులో ఓ చోట నిర్బంధించి చితకబాదారు. కాగా బ్రహ్మాజీరావు కనిపించకపోయేసరికి పటమట పోలీస్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. దీంతో డాక్టర్లు అతన్ని 15వ తేదీ ఉదయం ఇంటి వద్ద వదిలేసి వెళ్లారు. బాధితుడు సీపిని ఆశ్రయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ వ్యవహారంలో ట్రాఫిక్ ఏసిపి కె సూర్యచంద్రరావు డాక్టర్లకు కొమ్ముకాసి అండగా నిలబడ్డాడు. పటమట సిఐ కెనడీ కూడా వారికి అనుకూలంగా వ్యవహరించినట్లు సీపి విచారణలో వెల్లడైంది. దీంతో సిఐని వేకెన్సీ రిజర్వుకు పంపారు. ఏసిపిని డిజి కార్యాలయానికి సరెండర్ చేశారు. డాక్టర్లపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బ్రాహ్మాజీరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.